చంద్రబాబునాయుడుకు ఇద్దరు కీలక నేతలు పెద్ద షాకే ఇచ్చారు. చంద్రబాబు అధ్యక్షతన పార్టీ విస్తృతస్ధాయి సమావేశం జరిగిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో  ఎంఎల్ఏలు, ఎంపిలు, పొలిట్ బ్యూరో సభ్యులు, ఓడిపోయిన అభ్యర్ధులు, నేతలు చాలా మందే పాల్గొన్నారు. అయితే ఇద్దరు కీలక నేతలు గంటా శ్రీనివాసరావు, కేశినేని నాని మాత్రం హాజరుకాలేదు.


మొన్నటి ఎన్నికల్లో విశాఖపట్నం నుండి అసెంబ్లీకి గెలిచారు. అలాగే విజయవాడ ఎంపిగా కేశినేని నాని గెలిచారు. అయితే పార్టీ ఘోరంగా ఓడిపోయిన తర్వాత నుండి వీళ్ళద్దరు చంద్రబాబుతో సరైన సంబంధాలు మెయిన్ టైన్ చేయటం లేదు. వివిధ కారణాలతో ఇద్దరు నేతలు చంద్రబాబుపై అసంతృప్తి వ్యక్తం  చేస్తునే ఉన్నారు.

 

పబ్లిక్ అకౌంట్స్ కమిటి ఛైర్మన్ పదవి తనకు ఇవ్వనందుకు చంద్రబాబుపై గంటా గుర్రుగా ఉన్నారు. ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి పిఏసి ఛైర్మన్ పదవి ఒక్కటే క్యాబినెట్ ర్యాంకుతో దక్కేది. ఆ పదవిని ఉరవకొండ ఎంఎల్ఏ పయ్యావుల కేశవ్ కు చంద్రబాబు కట్టబెట్టారు. అప్పటి నుండి పార్టీ కార్యక్రమాలకు మాజీ మంత్రి గంటా  దూరంగానే ఉంటున్నారు.

 

ఇక కేశినేని గురించి కొత్తగా చెప్పేదేమీ లేదు. గెలిచిన దగ్గర నుండి ట్విట్టర్, ఫేస్ బుక్ లో కేశినేని రచ్చ చేస్తునే ఉన్నారు. పార్టీ పరువును ఓ విధంగా ఎంపి రోడ్డున పడేశారు. మాజీ మంత్రి దేవినేని ఉమ, ఎంఎల్సీ బుద్ధా వెంకన్నతో ఎంపికి ఏమాత్రం పడదు. దాంతో వాళ్ళిద్దరినీ ఉద్దేశించి ఎంపి ట్విట్లర్లో చేస్తున్న వ్యాఖ్యలు పార్టీలో సంచలనంగా మారింది.

 

వాళ్ళమధ్య సయోధ్య కుదర్చాలని చంద్రబాబు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. అసలు వీళ్ళద్దరూ టిడిపికి రాజీనామా చేసి బిజెపిలో చేరుతారనే ప్రచారం కూడా ఎక్కువగా ఉంది. ఈ నేపధ్యంలోనే పార్టీ సమావేశానికి వీళ్ళద్దరూ డుమ్మా కొట్టడటంతో ఒకటే చర్చ జరుగుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: