జియో నెట్ వర్క్ .. భారతదేశపు టెలికాం రంగంలో ఒక సంచలనమని చెప్పాలి. అప్పటివరకు ఎటువంటి పోటీ లేని టెలికాం రంగంలో ఎయిర్టెల్ , ఐడియా .. వినియోగదారులను ఘోరంగా దోచుకున్నాయి. వారికీ ఎప్పుడు బుద్ధి  పుడితే అప్పుడు రీఛార్జ్ అమౌంట్స్ పెంచేసేవారు. వారికీ పోటీ ఇచ్చే పోటీదారుడు మార్కెట్ లో లేకపోయే సరికే వారు పాడిందే పాట .. ఆడిందే ఆటగా తయారైంది. దీనితో కస్టమర్స్ కు వేరే దారి లేక వాటినే వినియోగించాల్సిన పరిస్థితి . అయితే ఎప్పుడైతే టెలికం రంగంలోకి ముఖేష్ అంబానీ జియో వచ్చిందో అప్పటి నుంచి ఇండియా ముఖ చిత్రమే మారిపోయింది. ప్రజల్లోకి 'డేటా' విప్లవం తీసుకొచ్చారు. తక్కువ రేట్లకు అపరిమితమైన డేటా ను ఇవ్వటం మొదలు పెట్టారు. 


దీనితో అతి తక్కువ కాలంలో సుమారు 20 కోట్ల పైగా కస్టమర్స్ ను సాధించి దేశంలోనే నెం .1 గా అవతరించింది. అప్పటి వరకు ఇష్టానుసారం రేట్లను పెంచుకుంటూ పోతున్న ఎయిర్టెల్, ఐడియా .. జియో నుంచి పోటీ తట్టుకోవటానికి రేట్లను తగ్గించక తప్పలేదు. అయితే 2016 లో జియో అడుగు పెట్టినప్పటి నుంచి ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకుంది. లాస్ట్ ఇయర్ జియో ఫోన్ దేశపు మొదటి తక్కువ ధరలో 4G ఫోన్ ను విడదల చేసిన సంగతీ తెలిసిందే. 


అయితే జియో ఇప్పుడు తాజాగా మరో సంచలన ఆఫర్ ను ప్రజలకు అందించాలని ముందుకు వచ్చింది. ముఖేష్ అంబానీ ఇప్పటీకే ఇంట్లోనే సినిమాను చూసే ఏర్పాటు చేస్తామని అది జజియో ప్రీమియర్ కస్టమర్లు కు అందుబాటులో ఉంటుందని చెప్పిన సంగతీ తెలిసిందే. అయితే ఇది వాస్తవ రూపంలో అమలు చేయడం సాధ్యమేనా ..? అనే సందేహాలు వస్తున్నాయి. ఇంతక ముందు కూడా చాలా మంది ఇలాగే ప్రయత్నించి విఫలమయ్యారు. ఇప్పటికే ముల్టీఫ్లెక్ యాజమాన్యం కూడా ఇదే అయ్యేపనే కాదని తేల్చి  చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: