కేసీయార్ తెలంగాణా ముఖ్యమంత్రి. ఆయనకు పుష్కలంగా రాజకీయ అనుభవం ఉంది. ఇపుడు రెండవసారి ముఖ్యమంత్రిగా కూడా అయ్యారు. ఆయన వ్యూహాలు, రాజకీయ తెలివిడి ముందు జాతీయ పార్టీలు కూడా మోకరిల్లాల్సిందే.  కేవలం ఇద్దరే ఎంపీలతో తెలంగాణా రాష్ట్రం సాధించిన గండర గండడు కేసీయార్. కేసీయార్ ఏం చేసినా అందులో రాజకీయ ప్రయోజనాలు, తెలంగాణా ప్రయోజనాలు పూర్తిగా  ఇమిడి ఉంటాయని అంటారు.


ఇదిలా ఉండగా కేసీయార్ హై హ్యాండ్ నేచర్  ఏపీ విషయంలో ఎక్కువైందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. కేసీయార్ వ్యక్తిగత పర్యటన కోసం ఏపీకి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన చేసిన కొన్ని హాట్ కామెంట్స్ ఇపుడు రాజకీయల్లో వేడి పుట్టిస్తున్నాయి. రాయలసీమను రతనాల సీమను చేస్తానని కేసీయార్ ఇచ్చిన స్టేట్మెంట్ పై ఇపుడు సోషల్ మీడియాలో చెడుగుడు ఆడుతున్నారు.అసలు కేసీయార్ ఎవరు రాయలసీమ గురించి చెప్పడానికి అంటున్నారు. ఏపీకి ముఖ్యమంత్రి లేరనుకుంటున్నారా అని నిలదీస్తున్నారు. కేసీయార్ హై హ్యాండ్ చూపిస్తే ఏపీ ప్రజలు సహించరని కూడా అంటున్నారు.



రాయలసీమ నుంచి వచ్చిన జగన్ కి ఆప్రాంతం  గురించి బాగా తెలుసని, ఆయన కంటే కేసీయార్ కి ఎక్కువ తెలుసా అని ప్రశ్నిస్తున్నారు. అదే విధంగా కరవుతో అల్లాడుతున్న రాయలసీమకు పోతిరెడ్డిపాడుకు నీళ్ళు రాకుండా అడ్డుకున్నది కేసీయార్ కాదా అని సీపీఐ రామక్రిష్ణ ప్రశ్నిస్తున్నారు. ఇక నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టులకు నీళ్ళు విడుదలపైనా కేంద్రం వద్ద పంచాయతి పెట్టింది కూడా కేసీయార్ కాదా అని ఆయన నిలదీశారు. ఏపీలో ప్రాజెక్టులకు అడ్డుపుల్లలు వేసిన కేసీయార్ ఇపుడు ఇలా మాట్లాడడం ఏంటని ఆయన అంటున్నారు.


ఇదిలా ఉండగా తాను జగన్ కి పెద్దన్నలా ఉంటూ గైడ్ చేస్తానని చెప్పడంపైనా ఏపీ నెటిజన్లు మండిపడుతున్నారు.  ఏపీకి ఓ ముఖ్యమంత్రి ఉన్నారు. ఆయన్ని జనం ఎన్నుకున్నారు. మీరు గైడ్ చేయాల్సిన అవసరం లేదని కూడా రిటార్టులు ఇస్తున్నారు. ఇదిలా ఉండగా కేసీయార్ ఆంధ్ర ప్రాంతంలోనూ రాజకీయ ఆధిపత్యం చూపించేందుకు ప్రయత్నిస్తున్నారా అన్న డౌట్లు కూడా నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు. ఇంతవరకూ ఏ పొరుగు సీఎం ఏపీకి వచ్చి ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదని, చూడబోతే కేసీయార్ ఉమ్మడి ఏపీకి సీఎం లా మాట్లాడుతున్నారని అంటున్నారు. ఓ విధంగా కేసీయార్ ఈ వాచాలత్వం వల్ల జగన్ కి ఇబ్బందులు కూడా కలుగుతాయని అంటున్నారు. మరి కేసీయార్ కామెంట్స్ విషయంలో జగన్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: