Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sat, Aug 24, 2019 | Last Updated 2:34 pm IST

Menu &Sections

Search

చంద్రబాబును వెనక్కు లాగుతున్న నేతలు

చంద్రబాబును వెనక్కు లాగుతున్న నేతలు
చంద్రబాబును వెనక్కు లాగుతున్న నేతలు
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

అవును చంద్రబాబునాయుడును సీనియర్ నేతలు వెనక్కు లాగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు, ఆందోళనలు చేయాలని నేతలకు, క్యాడర్ కు చంద్రబాబు పిలుపిచ్చిన విషయం తెలిసిందే. ఇక్కడే చంద్రబాబు ఆలోచనలతో కొందరు సీనియర్ నేతలు విభేదిస్తున్నారు.

 

ఐదేళ్ళ పాలనలో ఎన్ని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేసినా జనాలు ఓడించిన విషయాన్ని చింతకాయల అయ్యన్నపాత్రుడు లాంటి కొందరు నేతలు చంద్రబాబుకు గుర్తు చేశారు. పార్టీ విస్తృతస్ధాయి సమావేశంలో మాట్లాడుతూ జగన్ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే టిడిపి ఆందోళనలు చేస్తే బావోదని వాళ్ళు కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ’మన ప్రభుత్వం ఇంత చేసినా జనాలు పట్టించుకోకుండా జగన్ కు బ్రహ్మాండమైన మెజారిటి ఇచ్చిన తర్వాత మనం ఎంత ఆందోళనలు చేసినా ఉపయోగం ఉండద’ని స్పష్టంగా చెప్పారు.

 

పైగా జగన్ అధికారంలోకి వచ్చి మూడు నెలలే అయిన కారణంగా ఇప్పటికిప్పుడు నిరసనలు, ఆందోళనలు చేసినా ఉపయోగం ఉండదని కూడా చింతకాయల తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయటం గమనార్హం. చంద్రబాబుతో పాటు చాలామంది సీనియర్ నేతలు వేదిక మీద ఉండగానే చింతకాయల తన అభిప్రాయాలను చెప్పటం అందరినీ ఆశ్చర్యపరిచింది.

 

సో, జరిగినదాన్ని బట్టి అర్ధమవుతున్నదేమిటంటే జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా టిడిపి ఆందోళనలు చేయటం చాలామంది సీనియర్లకు పెద్దగా ఇష్టం లేదు. ఎందుకంటే జగన్ ఇంకా ప్రభుత్వంలో సరిగా కుదురుకోనే లేదు. అధికారంలో వచ్చిన 60 రోజుల్లో 25 రోజులు అసెంబ్లీ సమావేశాలతోనే సరిపోయింది. మిగిలిన 35 రోజులు వివిధ శాఖలతో సమీక్షలని, ఉన్నతాధికారులతో సమావేశాలని, రెండుసార్లు ఢిల్లీ పర్యటనలు, రెండుసార్లు వ్యక్తిగత పనులపై విదేశాలకు వెళ్ళటంతోనే సరిపోయింది.

 

అదే సమయంలో చంద్రబాబు ఆరోపిస్తున్నట్లుగా వైసిపి ప్రభుత్వంలో అరాచకాలేమీ జరగటం లేదు. టిడిపి నేతలపై దాడులూ జరగటం లేదు. ఎక్కడైనా జరిగినా అవి వ్యక్తిగత కక్షలతో జరిగినవే. హోలు మొత్తం మీద అసలు విషయం ఏమిటంటే జనాలకు ఎవరికి ప్రభుత్వంపై వ్యతిరేకత లేదు. ఆ విషయాన్నే చింతకాయల స్పష్టంగా చెప్పారు. మరి ఇపుడు చంద్రబాబు ఏమి చేస్తారో చూడాలి.


seniors-putting-breaks-to-naidu
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
రైతుల తరపున పవన్ పోరాటాలా ?
నేతలకు లై డిటెక్టర్ టెస్ట్ చేయించాలేమో
కోడెల అంటే చంద్రబాబు, లోకేష్ భయపడుతున్నారా ?
జగన్ ప్రభుత్వంపై కుట్ర జరుగుతోందా ?
జగన్ పై కేంద్రం సీరియస్..కారణమదేనా ?
బిజెపిలో చంద్రబాబు పట్టు పెరుగుతోందా ?
చీఫ్ మార్షల్ సాక్ష్యమే కోడెల కొంప ముంచిందా ?
బ్రేకింగ్ న్యూస్ : కోడెల పై క్రిమినల్ కేసు
రాజధానిపై జగన్ సంచలన నిర్ణయం ?
కోడెలపై పార్టీ సంచలన నిర్ణయం ?
కోడెల ఇంట్లో దొంగతనం అంతా డ్రామాయేనా ?
జగన్ కు సమస్యల స్వాగతం
వైసిపి నేతలే జగన్ ను అడ్డంగా బుక్ చేసేస్తున్నారా ?
సంచలనం : కోడెల ఇంట్లో దొంగతనం..ఫర్నీచర్ మాయంలో కొత్త ట్విస్ట్
తుళ్ళూరు ప్రాంతంలో కొత్త రాజధాని ?
చంద్రబాబు ముందు  జగన్ నిలబడగలరా ?
ఇళ్ళ నిర్మాణంపై జగన్ సంచలన నిర్ణయం
పచ్చ బ్యాచ్ కు జగన్ తానే ఆయుధాలు అందించారా ?
మొదటిసారిగా జగన్ కు హై కోర్టు షాక్
టిడిపి నేతలకు వీళ్ళే అడ్డుపడుతున్నారా ?
చిదంబరం బెయిల్ విషయంలో చంద్రబాబు ప్రయత్నించలేదా ?
లోకేష్ బృందంపై  చర్యలకు రంగం సిద్ధం ?
రాజుకుంటున్న ’రాజధాని’ మంటలు
చిదంబరం అరెస్టుకు తెలుగు ప్రజల మద్దతు..ఎందుకో తెలుసా ?
జగన్ పై హిందు వ్యతిరేకి ముద్ర
చిదంబరం అరెస్టుతో ఖుషీగా ఉన్నదెవరో తెలుసా ?
చిదంబరానికి సుప్రింకోర్టు షాక్
దొనకొండలో ఏం జరుగుతోందో తెలుసా ?
జగన్ హామీ అమలయ్యే అవకాశం లేదా ?
చంద్రబాబు గడ్డి కరిచారా ?
ఒక్క పరిశ్రమైనా వెళ్ళిపోయిందా ?
పెయిడ్ ఆర్టిస్టులతో టిడిపి బురద రాజకీయాలా ?
యడ్డీకి అప్పుడే అసమ్మతి సెగ ?
మొత్తానికి అసలు గుట్టు బయటపెట్టిన చంద్రబాబు
గెలిచిన వాళ్ళకన్నా ఓడిన వాళ్ళే హ్యాపీ
కోడెలకు మరీ ఇంత కక్కుర్తా ?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.