Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Aug 19, 2019 | Last Updated 10:02 am IST

Menu &Sections

Search

అదును చూసి చంద్రబాబును దెబ్బ కొట్టబోతున్న జగన్

అదును చూసి చంద్రబాబును దెబ్బ కొట్టబోతున్న జగన్
అదును చూసి చంద్రబాబును దెబ్బ కొట్టబోతున్న జగన్
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

సరిగ్గా సమయం చూసి మరీ చంద్రబాబునాయుడును జగన్మోహన్ రెడ్డి దెబ్బ కొడుతున్నారు. గ్రామ సచివాలయాల ఉద్యోగులు, గ్రామ వాలంటీర్ల నియామకాలను పూర్తి చేయటం ద్వారా పార్టీని గ్రామీణ స్ధాయిలో బలోపేతం చేయాలన్నది జగన్ ఉద్దేశ్యంగా కనబడుతోంది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా జరిగేది ఇదే కాబట్టి జగన్ చేసేదానిలో తప్పేమీ లేదు.

 

ఇదే పనిని అధికారంలో ఉన్నపుడు జన్మభూమి కమిటిల పేరుతో చంద్రబాబు కూడా చేశారు. కాకపోతే జన్మభూమి కమిటిలు ఓ మాఫియా లాగ తయారవ్వటంతో పార్టీకి తీరని నష్టం జరిగింది. సరే అసలు విషయానికి వస్తే గ్రామసచివాలయాల్లో భర్తీ చేయబోయే ఉద్యోగులు, గ్రామ వాలంటీర్ల నియామకాలను రాజకీయంగా వ్యతిరేకించాలని చంద్రబాబు పార్టీ నేతలకు పిలుపిచ్చారు. అయితే అందుకు నేతలు వెనకాడుతున్నారు. గ్రామ సచివాలయాలు కానీ గ్రామ వాలంటీర్ల వ్యవస్ధ కానీ అమల్లోకి వస్తే సుమారు 4.5 లక్షల మందికి ఒకేసారి ఉద్యోగాలు వస్తాయి.

 

ఇన్ని లక్షల మందికి ఉద్యోగాలు వచ్చిన తర్వాత కూడా వాటిని రాజకీయ కోణంలో టిడిపి నేతలు విమర్శించినా, ఆరోపించినా జనాలు తమపై తిరగబడే అవకాశాలే ఎక్కువున్నట్లు నేతలు భయపడుతున్నారు. ఇదే విషయాన్ని చంద్రబాబుతోనే నేరుగా చెప్పేశారని సమాచారం. ఇక ఈ ఏడాదిలోనే స్ధానిక సంస్దల ఎన్నికలు జరగబోతున్నాయి. సర్పంచు నుండి ఎంపిటిసి, జడ్పిటిసిలతో పాటు మున్సిపాలిటి ఎన్నికలు కూడా వరసగా జరపాలని జగన్ నిర్ణయించారు.

 

అంటే ఎన్నికలకంటే ముందే 4.5 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేస్తాయి. ఒకేసారి ఇన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత జరిగే ఎన్నికల్లో సహజంగానే గ్రామస్ధాయి నుండి మున్సిపల్ స్ధాయి వరకూ అధికారపార్టీ వైపే జనాలు మొగ్గు చూపే అవకాశం ఉందని టిడిపి నేతలు ఆందోళన పడుతున్నారు. అంటే మొన్న సాధారణ ఎన్నికల్లో దెబ్బ తిన్నట్లే రేపు స్ధానిక సంస్ధల ఎన్నికల్లో టిడిపికి చావు దెబ్బ తప్పదనే అనిపిస్తోంది.

 


jagan-cornering-naidu
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
కడప జిల్లాలో చంద్రబాబుకు తొందరలో షాక్ ?
ఈ ఎంఎల్సీ ఆత్మహత్య చేసుకుంటారట
జగన్-చంద్రబాబుకి తేడా ఏంటో తెలుసా ?
చంద్రబాబు ఇంట్లో ఇల్లీగల్ కార్యక్రమాలు జరుగుతున్నాయా ?
విలీనం చేయమంటూ పవన్ పై ఒత్తిడి  చేస్తోందెవరు ?
డ్రోన్ రాజకీయం :చంద్రబాబు ఇంటిమీద దాడి కుట్ర ? కరకట్టపై ఉద్రిక్తత
జగన్ పాలన బ్రహ్మాండమంటున్న టిడిపి నేత
భోరుమని ఏడ్చేసిన మాజీ ఉప ముఖ్యమంత్రి
చంద్రబాబు ఇంటిని ముంచేయటానికే నీళ్ళు వదులుతున్నారా ?
అన్న క్యాంటిన్ల కోసం ఉద్యమాలు చేస్తారట
ఎక్కడా తగ్గటం లేదు..టిడిపిని చెడుగుడు ఆడేస్తున్నారు
వాలంటీర్లు చేయాల్సిన పనులేంటో తెలుసా ?
జగన్ మొండితనం చంద్రబాబుకు ఇపుడే అర్ధమైందా ?
బంగారు తెలంగాణా అయిపోయింది..ఇక ఆకుపచ్చ తెలంగాణా
జగన్ కు హ్యాట్సాఫ్ చెబుతున్న తమ్ముళ్ళు
అసెంబ్లీ సీట్లు పెరిగితే ఏపిలో ఎవరి పరిస్ధితేంటి ?
కష్టపడినా ఫలితం దక్కుతుందా ?
జగన్ చేసిన పనితో కలెక్టర్లకు చెమటలు పట్టేశాయి
కేంద్రం నిర్ణయంతో జగన్ నెత్తిన పాలు పోసినట్లే
ఏదో అనుకుంటే చంద్రబాబుకే షాక్ తగిలింది
పరువు పోగొట్టుకున్న జనసేనాని
అదును చూసి చంద్రబాబును దెబ్బ కొట్టబోతున్న జగన్
చంద్రబాబును వెనక్కు లాగుతున్న నేతలు
చంద్రబాబు ఇంటికి వరద ప్రమాదం..ఇసుక బస్తాలతో రక్షణ
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.