జనసేన అధిపతి పవన్ కల్యాన్ తన ఆవేశంతో మరోసారి పరువు పోగొట్టుకున్నారు. పేకాట వ్యవహారంలో అరెస్టయిన ఎంఎల్ఏ రాపాక వరప్రసాద్ ను విడుదల చేయకపోతే తాను రాజోలుకు వచ్చి ఉద్యమిస్తానని చేసిన హెచ్చరికలే విచిత్రంగా ఉంది. జనసేన తరపున గెలిచిన ఏకైక ఎంఎల్ఏ రాపాక ప్రజా సమస్యలపై పోరాటం చేస్తు అరెస్టు కాలేదు. పోనీ పోలీసులేమన్నా తప్పుడు కేసు పెట్టి అరెస్టు చేశారా అంటే అదీ కాదు.

 

పేకాటాడుతు దొరికిన తన మద్దతుదారులను విడిపించటానికి పోలీసులతో గొడవపడి అరెస్టయ్యారు. తాను చెప్పినా మద్దతుదారులను విడుదల చేయలేదన్న ఆగ్రహంతో ఎంఎల్ఏ తన మద్దతుదారులతో పోలీసుస్టేషన్ పై దాడి చేశారు. అందుకనే రాపాకతో పాటు మరికొందరిని నాన్ బెయిలబుల్ సెక్షన్ల క్రింద పోలీసులు అరెస్టు చేశారు. వాస్తవాలు ఇలావుంటే మధ్యలో పవన్ వీరావేశంతో పోలీసులకు వార్నింగులు ఇవ్వటం ఏమిటో ఎవరికీ అర్దం కాలేదు.

 

పవన్ ఉద్దేశ్యం ప్రకారం పేకాటాడుతున్న వాళ్ళని పోలీసులు అరెస్టు చేయటం తప్పేమో ? లేకపోతే తన మద్దతుదారులను విడిపించుకోవటం కోసం పోలీసులతో గొడవపడిన రాపాకను అరెస్టు చేయటం కూడా తప్పులాగే కనిపిస్తోంది. అంటే రాపాక పోలీసులతో గొడవపడటం, పోలీసుస్టేషన్ పై దాడి చేయటం కరెక్టే అన్నట్లుగా ఉంది. పవన్ ఆలోచనల ప్రకారం సినిమా జీవితానాకి నిజ జీవితానికి పెద్దగా తేడా ఉన్నట్లు లేదు. తన సినిమా గబ్బర్ సింగ్ లాగే నిజ జీవితంలో కూడా చేయొచ్చని అనుకుంటున్నారేమో ?

 

నేతలకు, క్యాడర్లో ఆత్మస్ధ్యర్యం నింపటం కోసం పవన్ బహుశా ఉద్యమం లాంటి పెద్ద పదాలు వాడేరేమో అన్న అనుమానం వస్తోంది. నేతలు, క్యాడర్ సంగతి సరే మరి మామూలు జనాల సంగతేంటి ? నోటికొచ్చిన ప్రకటనలు చేసేస్తే, ప్రభుత్వానికి తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తే జనాలు మెచ్చుకోరన్న విషయం మరచిపోయారేమో ?

 


మరింత సమాచారం తెలుసుకోండి: