ఏపీ సీఎం జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న చర్యల్లో స్పందన కార్యక్రమం ఒకటి.. ఇదేమీ కొత్తది కాదు.. గతంలో అందరు ముఖ్యమంత్రులూ చేసిందే.. ప్రతి సోమవారం గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసి ప్రజల నుంచి విజ్ఞాపన పత్రాలు తీసుకుంటారు. ఆ సమస్యల పరిష్కారం కోసం అధికారులు ప్రయత్నించాలి.


కానీ ఏళ్ల తరబడి ఈ కార్యక్రమం ఓ తంతులా సాగుతుందే తప్ప.. ప్రజల సమస్యలు పరిష్కారం అయ్యేది చాలా తక్కువ. అందుకే ఈ కార్యక్రమం పట్ల జగన్ చాలా పట్టుదలగా ఉన్నారు. స్పందన కార్యక్రమానికి వచ్చే ఫిర్యాదుల్లో నూటి 99 శాతం క్లియర్ అవ్వాలని అధికార యాంత్రాంగానికి క్లియర్ గా చెప్పేస్తున్నారు.


ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్పందన.. ప్రజా పరిష్కార వేదిక.. కార్యక్రమంపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించిన వేళ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అవినీతి ఎక్కడా ఉండకూడదు. ఎమ్మార్వోలు, ఎస్సైలు, దిగువస్థాయి అధికారులకు మరోసారి చెప్పండి. ప్రజలెవరైనా వినతులతో వస్తే వారిని చిరునవ్వుతో స్వాగతించండి. కలెక్టర్లు తప్పనిసరిగా మండల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించాలి’అని సీఎం వైయస్‌ జగన్‌ అధికారులకు ఆదేశాలిచ్చారు.


స్పందన కార్యక్రమంపై సీఎం జగన్ చాలా ఆశలు పెట్టుకున్నారు. ఈ కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహిస్తే.. అది మౌత్ టాక్ ద్వారా వైసీపీ సర్కారుకు మంచి పేరు తీసుకువచ్చే అవకాశం వుంది. ఇప్పటికే గ్రామ స్థాయిలో వాలంటీర్ల వ్యవస్థ ను ఏర్పాటు చేసిన జగన్.. ప్రజలు తమ సమస్యలు చెప్పుకునేందుకు అన్ని అవకాశాలు అందుబాటులో ఉండాలని ప్రయత్నిస్తున్నారు. గ్రామ సచివాలయ వ్యవస్థ కూడా అందుబాటులోకి వస్తే.. ప్రజా సమస్యల పరిష్కారం మరింత సులభమవుతుందన్నది జగన్ ఆలోచన. వీళ్లంతా చిరునవ్వుతో ప్రజలకు సేవలందించ గలిగితే.. తక్కువ సమయంలోనే మంచి సీఎంగా పేరు సంపాదించుకోవచ్చన్నది జగన్ ప్లాన్.


మరింత సమాచారం తెలుసుకోండి: