ఆర్టికల్ 370 ని రద్దు చేసి జమ్మూ కశ్మీర్ , లడఖ్ లను  కేంద్ర పాలిత ప్రాంతాలుగా  మార్చుతూ ఇటీవల మోదీ సర్కార్  నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.  కాగా ఈవిషయాన్ని ప్రపంచ దేశాల  దృష్టికి తీసుకెళ్లి  భారత్ ను దోషిగా చూపించాలనుకొని  ఘోరంగా భంగపడింది పాకిస్థాన్.  ఈవిషయంలో చైనా , అమెరికా , రష్యా సహాయం  కోరగా ఆ మూడు దేశాలు భారత్ తీసుకున్న నిర్ణయానికే మద్దతూ పలుకుతూ .. పాక్ ను ఛీ కొట్టాయి. అయినా కూడా  ఆ దేశ ప్రధాని  ఇమ్రాన్ ఖాన్ కు బుద్ధి రాలేదు. ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని  ఎదురుచూస్తున్నాడు.

అందులో భాగంగా లఢక్ సరిహద్దు వద్ద ఎఫ్ 16 యుద్ధ విమానాలను మోహరించాడు అని తెలుస్తుంది.  అయితే  భారత్ ఫై ఎఫ్16 యుద్ధ విమానాలను వాడరాదు అంటూ  గతంలోనే గట్టిగా హెచ్చరించింది అమెరికా. కాగా ఇండియా...  పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నా సంయమనం పాటిస్తుంది. దానికి కారణం లేకపోలేదు. ఒకవేళ పాకిస్థాన్ యుద్దానికి దిగితే  పనిలో పనిగా  పాక్ ఆక్రమిత కశ్మీర్ ను కూడా విముక్తి చేయాలని .. ఆదిశగా ఇప్పటికే నరేంద్ర మోదీ మాస్టర్ ప్లాన్ వేసినట్లు తెలుస్తుంది. అందులో భాగంగా  జాతీయ భద్రత సలహాదారుడు అజిత్ డోబాల్  ఆర్టికల్ 370 రద్దుకు ముందే  ఆర్మీ , ఎయిర్ ఫోర్స్ , మిలిటరీ ఇంటెలిజెన్స్ చీఫ్ లతో  సమావేశం నిర్వహించాడు. ఆ తరువాత అమర్ నాథ్ యాత్ర కోసం వచ్చిన వారిని వెనక్కు  పంపించేసి హై అలెర్ట్ ప్రకటించి ఆర్మీ బలగాలను  రంగం లోకి దించారు.




మరింత సమాచారం తెలుసుకోండి: