అభినందన్ వర్థమాన్ ఈ పేరు తెలియని వారు మన దేశంలో కానీ పక్కనే ఉన్న పాకిస్తాన్ లో గాని ఉండరు. పాకిస్తాన్ గడ్డపై యుద్ద ఖైదీ అయ్యి ఎంతో ధైర్య సాహసాన్ని ప్రదర్షించిన మన వింగ్ కమాండర్ అభినందన్ భారత దేశానికి ఎంతో గొప్ప పేరు తెచ్చిపెట్టారు .వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమానకు మరో గౌరవం దక్కింది. అభినందన్ కు వీరచక్రా పురస్కారమివ్వాలని కేంద్రానికి సిఫార్సు చేశారు. దీనికి కేంద్రం కూడా అంగీకరించింది. రేపు స్వాతంత్య్ర దినోత్సవం రోజున వీరచక్రా పురస్కారాన్ని అభినందన్ కి ఇవ్వనున్నారు .


జమ్ము కశ్మీర్ లో అంతర్జాతీయ సరిహద్దులను దాటుకుని మన దేశ గగనతలంలోకి చొచ్చుకొచ్చిన పాకిస్థాన్ వైమానిక యుద్ధ విమానాన్ని తరిమికొట్టిన ఘనత అభినందన్ కు దక్కింది. పుల్వామా జిల్లా అవంతిపురా దగ్గరా ఫిబ్రవరిలో ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో నలభై మందికి పైగా సిఆర్ పిఎఫ్ జవాన్లు వారి ప్రాణాలు కోల్పోయారు. దీనికి ప్రతీకారంగా మన దేశ వైమానిక దళం సర్జికల్ స్ట్రైక్ చేపట్టింది. జమ్మూకాశ్మీర్  సరిహద్దులను దాటుకుని పాకిస్థాన్ గగనతలంలోకి ప్రవేశించింది. బాలకోట్ లోని జైషే మహమ్మద్ ఉగ్రవాద శిబిరాలపై బాంబులు వేసి వాటిని నేలమట్టం చేసింది . ఈ ఘటన చోటు చేసుకున్న కొద్ది రోజులకే పాకిస్థాన్ వైమానిక దళం కూడా మన దేశ గగనతలంలోకి ప్రవేశించింది. మన ఆర్మీ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని బాంబుల వేసినప్పటికీ అవి గురి తప్పాయి.


ఆ తర్వాత పాకిస్థాన్ కు చెందిన వైమానిక దళ యుద్ధ విమానాన్ని వెంబడిస్తూ మిగ్ ట్వంటీ వన్ యుద్ద వైమానంలో కూలిపోవడం వల్ల  అభినందన్ దురదృష్టవశాత్తు పాక్ గడ్డపై దిగాల్సి వచ్చింది. పాకిస్థాన్ సైన్యం చేతికి చిక్కారు. శత్రుదేశానికి యుద్ధఖైదీగా దొరికినప్పటికీ అభినందన్ దేశ రహస్యాన్ని వెల్లడించలేదు. తీవ్రంగా హింసించినా భయపడలేదు. ఎంతో ధైర్యాన్ని ప్రదర్శించారు. చివరికి అంతర్జాతీయ ఒత్తిళ్లకు తలవంచిన పాకిస్థాన్ కొద్ది రోజుల వ్యవధిలోనే ఆయన ను స్వదేశానికి అప్పగించింది. శత్రువుల చేతికి చిక్కిన ఏమాత్రం భయపడకుండా అభినందన్ చూపిన ధైర్య సాహసాలకు యావత్ దేశం సలామ్ కొట్టింది. ఇప్పుడు వీరచక్ర పురస్కారంతో కేంద్రం అభినందన్ ను సత్కరిస్తూ  తన  గొప్పతనాన్ని తెలియజేస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: