ఏదో చేద్దామని అనుకుంటే ఇంకేదో అయ్యిందన్నట్లుగా తయారైంది చంద్రబాబునాయుడు పరిస్ధితి. చంద్రబాబు అధ్యక్షతన  పార్టీ విస్తృతస్ధాయి సమావేశం జరిగిన విషయం తెలిసిందే. ఆ సమావేశంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ఓ రకంగా యుద్దమే ప్రకటించాలని నిర్ణయించారు చంద్రబాబు. సీనియర్లు, జూనియర్ నేతలు, క్యాడర్ అంతా తానేం చెబితే మారు మాట్లాడకుండా వింటారని అనుకున్నారు.

 

కానీ ఇక్కడే చంద్రబాబు తప్పులో కాలేశారు. కొద్ది రోజులుగా జగన్ ప్రభుత్వంపై చంద్రబాబు ఒంటికాలిపై లేస్తున్న విషయాన్ని అందరూ చూస్తున్నదే. అసెంబ్లీలో కానీ బయట కానీ చంద్రబాబును నోరెత్తనీయకుండా జగన్ అండ్ కో వాయించేస్తున్నారు. దాంతో జగన్ పై చంద్రబాబులో రోజురోజుకు ఉక్రోషం పెరిగిపోతోంది. అందుకనే నోటికొచ్చిచినట్లు జగన్ పై ఆరోపణలు, విమర్శలు చేసేస్తున్నారు.

 

జగన్ పై తనలోని కోపాన్నంతా పార్టీ సమావేశంలో పెట్టి అందరి చేతా జగన్ ను తిట్టిద్దామని అనుకున్నారు. అయితే చంద్రబాబు అనుకున్నట్లుగా సీనియర్లు ఎవరూ జగన్ పై రెచ్చిపోలేదు. పైగా పార్టీలోనే ఏదో తప్పుందని మాట్లాడారు. బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ జనాల కోసం అంత చేసినా ఓట్లు మాత్రం జగన్ కే పడ్డాయంటే మనలో ఎక్కడ లోపాలున్నాయో చూసుకోవాలని అన్నారు. 


అదే సమయంలో జగన్ ప్రభుత్వంపై ఇపుడు ఆందోళనలు, నిరసనలు చేస్తే జనాలు పట్టించుకోరని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు చెప్పాటాన్ని చాలామంది సీనియర్లు మద్దతిచ్చారట. అధికారంలోకి వచ్చిన రెండు నెలలకే ప్రభుత్వంపై మనం వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తే జనాలెవరూ మద్దతివ్వరంటూ అయ్యన్న చెప్పారు. మాట్లాడిన కొద్దిమంది సీనియర్లు కూడా వీళ్ళనే సమర్ధించారట.జగన్ ప్రభుత్వంపై జనాల్లో వ్యతిరేకత వచ్చేంత వరకూ మనం ఓపిక పట్టాలని చేసిన సూచన చంద్రబాబుకు ఏమాత్రం రిచించలేదు. కానీ అయ్యన్న చెప్పింది నిజమే కాబట్టి చేసేదేమీ లేక చంద్రబాబు మౌనం వహించాల్సొచ్చింది. అంటే చంద్రబాబు ఒకటనుకుంటే జరిగంది మరొకటన్నమాట.


మరింత సమాచారం తెలుసుకోండి: