పోలవరం పనుల టెండర్ లను ఏపీ ప్రభుత్వం రద్దు చేస్తూ , నవయుగ కంపెనీకి టెర్మినేషన్ లెటర్ జారీ చేసిన సంగతీ తెలిసిందే. అయితే ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా తన అసహనాన్ని వ్యక్తం చేసింది. ఇలా చేయడం వల్ల పోలవరం పనులు ఆలస్యం అవుతాయని .. తరువాత కాంట్రాక్టర్ కూడా దొరకడం కష్టమని ఇప్పటికే కేంద్రం ప్రభుత్వం చెప్పింది. ఇదే విషయం మీద పోలవరం అధారిటీ కూడా పనులు జాప్యం అవుతాయని, మళ్ళీ కాంట్రాక్టు కు టెండరింగ్ ఇవ్వాలంటే ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగే అవకాశం ఉందని చెప్పింది. నిజానికి పోలవరం అధారిటీ కేవలం ప్రాజెక్ట్ పనులను మాత్రమే చూసుకుంటుంది. టెండరింగ్ రద్దు చేయడానికి ప్రభుత్వం .. పోలవరం అధారిటీ అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు. 


అయితే పోలవరం అధారిటీ ముందు ఏపి అధికారులు చెప్పిన సమాధానాలు వింటే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ప్రజలకు ఏదైనా రాజకీయంగా చెప్పొచ్చు గాని అధికారులకు చెప్పలేరు కదా ! అయితే అథారిటీ ముందు అధికారుల మాటలు పేలవంగా తయారయ్యాయి. నవంబర్ 1 తేదీ నాటికి తిరిగి పనులు ప్రారంభిస్తామని చెప్పిన అధికారులు .. వీరి మాటలు అథారిటీకి నమ్మశక్యం అనిపించలేదు. 


మరి కొత్తగా పనులు మొదలు పెట్టడానికి యంత్రాలు సమకూర్చుకోవడానికి కొత్త సంస్థకు సమయం పడుతుంది కదా అని ప్రశ్నకు .. అధికారులు చెబుతూ నవయుగ కంపెనీ యంత్రాలు వాడుతామని సెలవిచ్చారు. ఇది ఒక్క సమాధానం చాలు. ఏపీ అధికారులు ఎంత క్లారిటీగా ఉన్నారో. నవయుగ కంపెనీ వద్దంటా .. కానీ వారి యంత్రాలు మాత్రం వాడుతారంటా .. దీనితో ప్రభుత్వం తొందరపడి చర్యలు తీసుకుందని క్లియర్ గా అర్ధం అవుతుంది. మరీ చూడాలి జగన్ ప్రభుత్వం దీనిని ఎలా హేండిల్ చేయబోతుందో !

మరింత సమాచారం తెలుసుకోండి: