సెప్టెంబర్ నెల వచ్చేస్తోంది. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినం అని మనందరికి తెలిసిందే.దీని కోసం ఇప్పట్టి నుంచే మన తెలంగాణ ప్రభుత్వం కావాల్సినవి అన్ని సిద్దం చేస్తోంది.ఇది ఇలా ఉంటే బీజేపీ మరియు టీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధంతో పరిస్తితి వేడెక్కుతోంది. విషయానికి వస్తే మన కేంద్ర హోం మంత్రి అమిత్ షా షో ఇంతకీ  హిట్టా ఫట్టా అంటే ఖచ్చితంగా హిట్ అంటున్నారు కాషాయ నేతలు. అలాంటి ఛాన్సే లేదంటున్నారు గులాబీ దళం.

మిషన్ తెలంగాణ లో సెప్టెంబర్ పదిహెడు పై ఫోకస్ పెట్టారు షా. దీంతో కాషాయ నేతల పై ఇప్పటి నుంచే కౌంటర్ ఎటాక్ మొదలుపెట్టారు టీఆర్ ఎస్ నేతలు. తెలంగాణ వచ్చినప్పటి నుంచి సెప్టెంబర్ పదిహెడు పై పంచాయతీ నడుస్తూనే ఉంది. ఈ సారి మాత్రం అప్పుడే రాజకీయం వేడెక్కింది. ఎందుకంటే ఈ సారి సెప్టెంబర్ పదిహెడు న కేంద్ర హోంమంత్రి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలంగాణకు వస్తుండటం ప్రాధాన్యతను తెలియజేస్తున్న విషయం.

కశ్మీర్ అంశంలో మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల అందరిలో ఇప్పటికే అనుకూల స్పందన పొందారు ఇప్పుడు బిజెపి నేతలు తెలంగాణ విమోచన దినాన్ని వాడుకోవాలని చూస్తున్నారు. షా రాకతో విజయవంతంగా పొలిటికల్ షో చూపించాలని భావిస్తున్నారు. జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సెప్టెంబర్ పది వరకు తెలంగాణ కు వస్తామన్నారు.

ఎప్పటినుంచో నడుస్తున్న జమ్మూ కశ్మీర్ సమస్య కు అమిత్ షా కేంద్ర హోం మంత్రి గా ఒక చక్కటి పరిష్కారం చూపారు, తప్పకుండా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కూడా అమిత్ షా నేతృత్వంలోనే  జరిపితే బాగుంటుందని ఈ సందర్భంగా బీజేపీ నేతలు తెలియజేశారు. బీజేపీ నేతల వ్యాఖ్యలకు గట్టిగా కౌంటర్ ఇచ్చారు టీఆర్ ఎస్ నేతలు .బీజేపీ కి బహిరంగ లేఖ రాశారు ఎమ్మెల్యే సుమన్, విమోచన దినం గురించి మాట్లాడుతున్న బిజెపి నేతలు ముందు తెలంగాణ కు ఏం చేశారో చెప్పా లని డిమాండ్ చేశారు.

సెప్టెంబర్ 17  విషయం లో ఇంత ఎగిరెగిరి పడుతున్నారు, తెలంగాణ బిడ్డగా ఒక ఉద్యమకారుడిగా కాళేశ్వరం ప్రాజెక్టుకు,మరియు మిషన్ భగీరథ  అయోగ్ నీతి ఆయోగ్ సిఫారసు చేసిన ఇరవై నాలుగు వేల కోట్లు ఇవ్వాలని, ముందు వాటిని మంజూరు చేసిన తరువాత తెలంగాణ అభివృద్ది గురించి మాట్లాడాలని ఆయన ప్రశ్నించారు. బీజేపీ ఎన్ని కుట్రలు పన్నినా అమిత్ షా ఎంత షో చేసినా తెలంగాణ లో మాత్రం ఫ్లాప్ కావడం ఖాయమన్నారు. ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఇక్కడ వాళ్ళకూ ఉనికి లేదు అని విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది.కేవలం రాజకీయంగా మేము ఇదేదో చక్రం తిప్పుతామని ఆధీనం లోకి తెచ్చుకుంటాం లేదంటే యూటీ ఇస్తాం పోటీ చేస్తాం అన్నట్టు గా మాటలు మాట్లాడడం బీజేపీ నేతలకు తగదని ఘాటుగా సమాధానం ఇస్తున్నారు టీఆర్ ఎస్ నేతలు.


బిజెపి పార్టీ ఎన్ని కుట్రలు కుతంత్రలు ఎత్తుగడలు వేసినా వందల కోట్ల రూపాయల నోట్లు దొరికి పోయిన, వాళ్ళు  అక్రమంగా సంపాదించినట్టు దాంతో కొంత డబ్బు ఖర్చు పెట్టి ఎక్కడెక్కడ గెలిచినట్లు మాత్రన కాంగ్రెస్ పార్టీల నాయకులను కొనుగోలు చేసినట్టు  ఆ కొంత నాలుగు స్థానాలు దక్కించుకున్న మాత్రాన్నా ఎక్కువ ఆశపడటం దురాశే అవుతుందని టీఆర్ ఎస్ నేతలు వ్యాఖ్యానించారు.

ఇలా ఈ సారి నెల రోజుల ముందు నుంచి సెప్టెంబరు పదిహెడు తెలంగాణ రాజకీయాం మాటల యుద్దలతో వేడెక్కిస్తోంది. అసలు సెప్టెంబరు పదిహెడు నిజంగా మన కాషాయ నేత 'షా'  ఎదైన వ్యూహంతో ఉన్నారా లేదా అనేది వేచి చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: