ఆరోగ్య శ్రీ పథకంతో దివంగత నేత రాజశేఖర్ రెడ్డి ఏపీ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖియించారు. ఈ పధకం వల్ల ఎంతో మంది పేద ప్రజలు ప్రాణాలు నిలబడ్డాయి. ఏ రాష్ట్రంలో లేని విధంగా కార్పొరేట్ హాస్పిటల్ లో లక్షల్లో ఖర్చు అయ్యే ఆపరేషన్  ఫ్రీ గా ప్రజలకు అందించిన ఘనత ఒక్క రాజ శేఖర్ రెడ్డికి మాత్రమే చెల్లింది. అందుకే ఆరోగ్య శ్రీ పధకాన్ని తరువాత వచ్చిన ప్రభుత్వాలు కూడా తొలిగించాడనికి సాహసించలేదు. అధికారంలో ఎవరు ఉన్న ఆరోగ్య శ్రీ అంటే .. ఇప్పటికే  రాజశేఖర్ రెడ్డి తప్పితే ఎవరు ప్రజలకు గుర్తుకు రారు. అయితే ఇప్పుడు ఏపీలో రాజశేఖర్ రెడ్డి కుమారుడిగా జగన్ ఏపీ సీఎంగా ఈ పధకాన్ని మరింత బలోపేతం చేసే దిశగా చర్యలు చేపడుతున్నారు. 


అయితే ఇప్పటికే జగన్ ఏపీ ముఖ్యమంత్రిగా ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకుంటూ తనదైన శైలిలో పాలనను నడిపిస్తున్నారు. సీఎంగా ప్రమాణం స్వీకారం చేసిన రెండు నెలలు కాకముందే మొదటి అసీంబ్లీలో ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకుంటూ తన పరిపాలన ఎలా ఉండబోతుందో మొదటి రెండు నెలల్లో అర్ధం అయ్యే విధంగా రాష్ట్ర ప్రజలకు చూపించారు.చాలా కీలక బిల్లులు అయిన ఉదాహరణకు వెనుకబడిన తరగతులకు నామినేటెడ్ పదవులకు 50 శాతం రిజర్వేషన్స్ అయితేనేం, అలాగే విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు కీలక సంస్కరణల కోసం కొత్త చట్టాన్ని తీసుకురావటం.. ఇవన్నీ పేద ప్రజలకు మేలు చేసేవి. 


అయితే ఇప్పుడు జగన్ ఆరోగ్య శ్రీ పధకాన్ని పక్క రాష్ట్రంలోని ప్రధాన నగరాలలో కూడా అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు చేబడుతున్నారు. అంటే తెలంగాణలోని హైదరాబాద్, బెంగళూరు, తమిళనాడులోని చెన్నై వంటి నగరాల్లో ఈ పధకం అందుబాటులోకి రాబోతుంది. దీని వల్ల సరిహద్దు ప్రజలకు ఎంతో ఉపయోగకరం. ఇంకా మెరుగైన వైద్యం అందేందుకు అవకాశం ఉంటుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: