ఆంధ్ర ప్రదేశ్ పిపిఏ పునః సమక్ష నిర్ణయంపై జపాన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ  కేంద్రం మరియు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాలకు ఘాటైన లేఖ రాసింది. చేసిన ఒప్పందాన్ని పునః సమీక్షించాలన్న నిర్ణయం పారిశ్రామికవేత్తలు మరియు పెట్టుబడులపై తీవ్ర ప్రభావం చూపుతోందని జపాన్ తన లేఖలో తెలియజేసింది. ఇప్పటికే మనుగడలో ఉన్న ఒప్పందాలను  మల్లి సమీక్షించడం ఎందుకని స్పష్టంగా లేఖలో రాసింది.

దేశంలోని పునరుత్పాదక విద్యుత్ రంగంలోకి పెట్టుబడులు వరదలా వస్తున్నాయి. పలు దేశాలకు చెందిన సంస్థలు పెట్టుబడులు మన దేశంలో పెడుతున్నాయి. ముఖ్యంగా ఏపీలో ఉన్న పీపీఎలపై జపాన్ పారిశ్రామిక వేత్తలు భారీగా పెట్టుబడులు పెట్టారు.ఒకసారి ఖరారైన ఒప్పందాలపై పునః సమీక్షలను ఫ్రాన్స్, దక్షిణాఫ్రికా మరియు యూరప్ దేశాలు గమనిస్తున్నాయని జపాన్ తెలిపింది. జపాన్ కు చెందిన ఎస్బి ఎనర్జీ, రెన్యూ సహా  ఏపీలో పలు కంపెనీలు విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకున్నాయి. 


ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం చేసిన ఒప్పందాల పునఃసమీక్షపై ఆ సంస్థలు తీవ్ర అభ్యంతరాలు తెలుపుతున్నాయి. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై పునఃసమీక్ష వద్దని కేంద్రం చెబుతున్న ఏపీ ప్రభుత్వం వినటం లేదు. ఏపీ ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని పునః సమీక్షించాలన్న నిర్ణయంపై రాజకీయంగా కూడా రగడ జరుగుతుంది. పిపిఏల విషయంలో ఏపీ ప్రభుత్వ తీరును కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్. కె. సింగ్ తప్పు పట్టారు. ఈ విషయాన్ని అమిత్ షా దృష్టికి తీసుకువెళ్ళాము అని తెలియచేసారు. పీపీఏల పునస్సమీక్ష పై ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన జీవో 63కి వ్యతిరేకంగా విద్యుత్ సంస్థలు ఏపీ హైకోర్టును ఆశ్రయించాయి.


టిడిపి ప్రభుత్వ హయాంలో ఏపీ ప్రభుత్వం పలు విద్యుత్ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. సౌర, పవన విద్యుత్ ను పలు ప్రైవేటు సంస్థల నుంచి కొనుగోలు చేసేందుకు ఒప్పందాలు చేసుకున్నారు. అయితే వీటిలో పెద్ద స్థాయిలో అవినీతి జరిగిందని వైసిపి ఆరోపిస్తోంది. మార్కెట్ రేట్లకు మించి అధిక ధరలను ప్రైవేట్ సంస్థలకు చెల్లిస్తూ చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్ర ఖజానాకు తీవ్ర నష్టం కలిగించిందని వాదిస్తోంది. 


చంద్రబాబు ప్రభుత్వ తీరు కారణంగా ఏటా 2766 కోట్ల రూపాయల నష్టం వస్తోందని నేరుగా జగన్  టీడీపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. అవసరం లేకపోయిన వాళ్లకు కావాల్సిన కంపెనీల్లో అధిక రేట్లకు పిపిఎల్ కొనుగోలు చేసుకున్నారని అయన ఆరోపించారు. ఆ భారాన్ని మోసే పరిస్థితుల్లో ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం విద్యుత్ పంపిణీ సంస్థలు లేవు అని జగన్ అన్నారు.  


వీటితో పాటు లేఖలో ఒకసారి విద్యుత్తు కొనుగోళ్లకు చెందిన ఒప్పందాలకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ తో పాటు పబ్లిక్ హియరింగ్ కూడా నడిచింది అని ఓపెన్ బిడ్డింగ్ లో వీటిని ఖరారు చేశారని తెలియజేశాయి. ఒకసారి ఖరారైన ఒప్పందాలను పునః సమీక్షించండం ఏమిటీ అని ప్రశ్నించాయి. దీంతో పాటు జపాన్ కు చెందిన పలువురు పారిశ్రామికవేత్తలు ఎఫ్బి ఎనర్జీతోపాటు, రెన్యూ ఎనర్జీ అనే రెండు కంపెనీలు కూడా భారత్ లో పునరుత్పాదక విద్యుత రంగంలో పెద్ద ఎత్తున చాలా ముఖ్యమైన స్టేక్ హోల్డర్ గా ఉన్నాయి. ఈ రెండు కంపెనీలతో పాటు యూరపు మరియు సౌతాఫ్రికా చెందిన పలు కంపెనీలు కూడా పెట్టుబడులు పెట్టాయి. 


ఇటువంటి తరుణంలో ఈ పునరుత్పాదక విద్యుత్ రంగంలో విద్యుత్ కొనుగోలు ఒప్పందాల పునఃసమీక్ష ఆయా దేశాలకు సంబంధించిన పెట్టుబడిదారులు మరియు పారిశ్రామిక వేత్తలను మళ్లీ  ఆ దేశాలు పంపే విధంగా ఉంది అని ఈ అంశంపై ప్రభుత్వం పునరాలోచన చేయాలి అని కోరారు. 
విద్యుత్ రంగంలో కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యానికి కూడా విఘాతం కలిగే ప్రమాదం ఉంది అని చెప్పి లేఖలో పేర్కొన్నారు.  లేఖని కేంద్ర ప్రభుత్వానికి రాయటంతో పాటు  కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్ కె సింగ్ మరియు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి మరియు  పునరుత్పాదక విద్యుత్ శాఖకి చెందిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కూడా లేఖ రాశారు. 


ఆంధ్ర ప్రదేశ్ కి చెందిన పునరుత్పాదక విద్యుత్ రంగంలో పెట్టుబడులు పెట్టిన పెట్టుబడుదారులు మరియు పలు కంపెనీలు కూడా హైకోర్టును ఆశ్రయించగా నెల రోజుల పాటు ఈ కేసుపై స్టే విధించింది. దింతో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 63 ను నిలిపివేయాలి అని హై కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో జపాన్ ప్రభుత్వం రాసిన ఈ లేఖ మాత్రం ఇటు ఆంధ్రప్రదేశ్ మరియు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న అధికార వర్గాలకు కాకరేపుతోంది.


దీని పై ఈ రోజు లేదా రేపటిలోపు కేంద్ర ప్రభుత్వం నుంచి మరి కొన్ని సందేశాలు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి అందే అవకాశం ఉంది.  జపాన్ దౌత్య కార్యాలయాన్ని నుంచి వచ్చిన ఈ లేఖలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి, కేంద్ర విద్యుత్ శాఖ కార్యదర్శితో పాటు ప్రధాన మంత్రి కార్యాలయానికి కూడా ఈ లేఖ రాశారు. దీని పై ఏపీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: