తెలంగాణలో వ‌ర్షాలు త‌గ్గుముఖం ప‌ట్ట‌డానికి మ‌రింత స‌మ‌యం ప‌ట్టే స‌మ‌యం క‌నిపిస్తోంది. ఉపరితల ఆవర్తనం, రుతుపవనాలు చురుకుగా కదలడం వల్ల బుధవారం రాష్ట్రంలోని కొన్నిచోట్ల భారీ వర్షాలు పడుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రుతుపవనాలు చురుకుగా కదులుతుండటంతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బుధవారం తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.


గురువారం నుంచి రుతుపవనాలు అంత బలంగా ఉండకపోవచ్చని, తేలికపాటి వానలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వాయవ్య బంగాళాఖాతంలో సోమవారం ఏర్పడిన అల్పపీడనం పశ్చిమబెంగాల్ దక్షిణ తీరం, ఉత్తర ఒడిశా తీరప్రాంతాల్లో కేంద్రీకృతమైందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీనికి అనుబంధంగా సముద్రమట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతుందని చెప్పారు. దీని ప్రభావం తెలంగాణపై అంతగాలేదని పేర్కొన్నారు. ఇదిలాఉండ‌గా, ఒకటి, రెండుచోట్ల భారీనుంచి అతిభారీ వర్షాలు కురువొచ్చని చెప్పారు. నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రత 31.4 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 24.6 డిగ్రీలు, గాలిలో తేమ 77 శాతంగా నమోదైందని పేర్కొన్నారు. వాతావరణం చల్లగా మారింది. కాగా, మంగళవారం ఉత్తర, ఈశాన్య తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయని పేర్కొంది.


ఇదిలాఉండ‌గా, గత కొన్ని రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా కురిసిన వర్షాలు అన్నదాతల్లో ఆశలు రేకెత్తించాయి. మొన్నటివరకు 15 శాతం లోటుగా ఉన్న వర్షపాతం సాధారణ స్థాయిని మించింది. లోటు ను దాటి 3 శాతం అధికంగా నమోదైంది. వరుసగా ఏర్పడుతున్న ఉపరితల ఆవర్తనాలు, అల్పపీడనాల ప్రభావంతో నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. జూన్ నుంచి జూలై 10 వరకు రాష్ట్రవ్యాప్తంగా సగ టు 462 మి.మీ. వర్షం కురవాల్సి ఉండగా 447.7 మి.మీటర్లు కురిసింది. ఆ తరువాత నుంచి ఇప్పటివరకు సగటు కంటే 3 శాతం అధికంగా వర్షాలు కురవడం విశేషం. ఉత్తర తెలంగాణలోని అన్ని జిల్లాల్లో అధిక వర్షపా తం నమోదు కాగా కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో రాష్ట్రంలోనే అత్యధికంగా 43 శాతం అధిక వర్షపాతం నమోదైంది. వరంగల్ అర్బ న్, జయశంకర్ భూపాలపల్లి, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. దక్షిణ తెలంగాణలో సగటు కంటే తక్కువ వర్షాలు కురిశాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: