ఒకప్పుడు తెలంగాణ పోరాట సమయంలో ప్రొఫెసర్ కోదండ రామ్ ఎంతగా పాపులర్ అయ్యారో అందరికీ తెలిసిందే. తెలంగాణ అసలు మనకు ఎందుకు రావాలి..ఎందుకు కావాలీ అన్న విషయాన్ని పల్లె పల్లె తిరుగుతూ ప్రజల్లో చైతన్యం తీసుకు వచ్చారు కోదండరామ్.  అప్పట్లో ప్రస్తుతం సీఎం కేసీఆర్ సైతం తన గురువు జయశంకర్ తర్వాత కోదండరామ్ మాటలకే ఎక్కువ విలువ ఇచ్చేవారని సమాచారం.  అంతే కాదు ఉద్యోగులు సకల జనుల సమ్మే సందర్భంగా మిలియన్ మార్చ్ ఎంతో సక్సెస్ ఫుల్ చేశారు. 

తెలంగాణ కోసం ఆత్మబలిదానాలు చేసుకున్న ప్రతి కుటుంబాన్ని పరామర్శించి వారికి దైర్యం చెప్పారు కోదండరామ్. అయితే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. ఆ సమయంలో కోదండరామ్ ఇక్కడ ఎంతో సముచిత స్థానం లభిస్తుందని అందరూ భావించారు..కానీ అంతా రివర్స్ అయ్యింది.  తెలంగాణ సిద్దించిన తర్వాత కేసీఆర్ కి కోదండరామ్ కి మద్య మాట యుద్దం నడిచింది..దాంతో వీరి మద్య ఉన్న సంబంధాలు తెగిపోయాయి.  ఆ సమయంలో కోదండరామ్ కొత్త పార్టీ పెట్టడం..ప్రతిపక్షమైన కాంగ్రెస్ తో చేయి కలపడం జరిగింది. ఇటీవల తెలంగాణ లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ మహాకూటమిగా ఏర్పడింది..అందులో కోదండరామ్ స్థాపించిన టీజేఎస్ భాగస్వామి అయ్యింది. 

కానీ ఎన్నికల ఫలితాల్లో మహాకూటమి చిత్తు చిత్తుగా ఓడిపోయింది. తాజాగా కోదండరామ్ కి తెలంగాణ పోలీసులు షాక్ ఇచ్చారు. కడ్తాల్ దగ్గర ఆయనను అడ్డుకున్నారు. కోదండరామ్ అమ్రాబాద్ యూరేనియం యాత్రకు బయలు దేరిన విషయం తెలిసిందే. హైదరాబాద్ నుండి నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్  వెళుతున్న కోదండరామ్ కారును వెళ్దొండ  దగ్గర అడ్డుకున్నారు. “అభయారణ్యంలో పులులు ఉంటాయి, అవి భయపడుతాయి, అందుకే మిమ్ములను అమ్రాబాద్ కు పంపడం లేదు” అని పోలీసులు సమాధానమిచ్చారు.

అమ్రాబాద్ యాత్రకు అనుమతిచ్చేది లేదన్నారు పోలీసులు.  గత కొన్ని రోజులుగా అమ్రాబాద్ అడవుల్లో  యురేనియం  తవ్వకాలపై  స్థానికంగా భయాందోళనలు  వ్యక్తమౌతున్నాయి.  ప్రభుత్వ  నిర్ణయాన్ని  వ్యతిరేకిస్తూ  పార్టీలు  ప్రజా  సంఘాలు  ఉద్యమం  ఉధృతం  చేస్తున్నాయి.   తాజాగా కోదండరామ్ ని పోలీసులు అడ్డుకోవడంపై   ప్రజా  సంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: