కారణాలు ఏవైనా కావొచ్చు..కానీ మనశ్శాంతి కోల్పోయి..మనో నిగ్రహం కోల్పోయి..జీవితం పై విరక్తి పుట్టి ఎంతో మంది ఆత్మహత్యలనకు పాల్పపడుతున్నారు. అందులో చదువుకోని అజ్ఞానులు కొందరైతే చదువు ఉండి పది మందికి ధైర్యం చెప్పగలిగే స్థాయి ఉన్నవారు కూడా మనస్తాపానికి గురై చనిపోతుంటారు.  కెరీర్ లో ముందుకు వెళ్లలేక ఏమీ సాధించలేక పోతున్నామన్న బెంగతో కొంత మంది అయితే..ఎంత సాధించినా ప్రతిఫలం దక్కక..సొసైటీలో సరైన గుర్తింపు రాని వారు మరికొందరు..ఇలా ఏ కారణంతో అయినా జీవితం పై విరక్తి పుట్టి అన్యాయంగా తనువు చాలించుకుంటున్నవారు ఎంతో మందిని ఈ మద్య చూస్తున్నాం. 

ఇందులో సెలబ్రెటీలు కూడా ఉన్నారు..ఎన్నో ఆశలతో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి ఉన్నట్టుండి ఏ ఛాన్సులు రాక..వేరే పనిలో ఇమడలేక జీవితంపై విరక్తి పుట్టి చనిపోయిన వారు ఉన్నారు.  అలాంటి వారిలో ఉదయ్ కిరణ్ ఒకరైతే ఎంతో మంది టీవీ సిరియల్స్ లో నటీ,నటులు చనిపోయారు.  కేవలం తెలుగు లోనే కాదు అన్ని ఇండస్ట్రీలో కెరీర్ లో ఇబ్బంది పడ్డవారు జీవితాన్ని మద్యలోనే ముగించుకున్నారు.  తాజాగా తన సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకొని ఓ ఐపీఎస్ అధికారి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన  హర్యానా రాష్ట్రంలోని ఫరీదాబాద్ లో చోటుచేసుకుంది. 

ఫరీదాబాద్  నగర  డీసీపీగా  పనిచేస్తున్న  విక్రంకపూర్…  ఉదయం  తన  సర్వీస్  రివాల్వర్ తో  కాల్చుకున్నాడు.  తీవ్రంగా  గాయపడి  తన  క్వార్టర్ లోనే  చనిపోయాడు. డీసీపీ ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. ఫరీదాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గత కొద్దిరోజులుగా ఆయన ఏదో విషయంలో బాగా మదనపడుతున్నారని కుటుంబసభ్యులు చెబుతున్నారు.  గతేడాదే ఆయనకు ప్రమోషన్ కూడా వచ్చినట్లు అధికారులు  చెబుతున్నారు. ఆయన మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడని ప్రస్తుతం కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసు అధికారులు అంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: