నరేంద్ర మోడీని తక్కువ అంచనా వేసిన అమెరికా  పెద్దన్న ట్రంప్ ఇపుడు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మరో వైపు చైనా ఎంత బోర విడిచినా కూడా మోడీ డొక్లాం దెబ్బ గుర్తుండిపోతోంది. అరబ్బు దేశాలకు కూడా మోడీ ఏంటో బాగా తెలుసు. తెలిసినా అలుసుగా ఉన్నది మాత్రం పాకిస్థాన్ కే. ఎందుకంటే మన దాయాది కదా. అమ్మ పెట్టే రెండూ కావాలంటోంది మరి.


ఈ రోజు పాకిస్థాన్ స్వాతంత్ర దినం. జాగ్రత్తగా దేశం కోసం నాలుగు మంచి కబుర్లు  చెప్పుకుంటే అది పాక్ ఎందుకు అవుతుంది. అందుకే ఆ దేశ అధ్యక్షుడు రెచ్చగొట్టుడు బాష  వాడారు. అలా ఇలా కాదు భారత్ మీద విషమే చిమ్మారు. కాశ్మీర్ ప్రజలు పాకిస్తానీయులేనట. ఇదెక్కడి పోలికే అర్ధం కాదు. అంతటితో వూరుకోని ఆయన భారత్ తో జీహాద్ తప్పదని హెచ్చరిస్తున్నారు. అంటే పవిత్ర యుధ్ధం చేస్తారట.


మరి ఈ విధమైన కావరం ప్రదర్శించాక భారత్ చూస్తూ వూరుకోదు కదా. కాశ్మీర్ విషయంలో డెబ్బయ్యేళ్ళలో జరిగిన పొరపాటుని మోడీ సరిదిద్దారు. మన దేశంలో పూర్తిగా అంతర్భాగం చేశారు. ఆ హక్కు మీకెవరు ఇచ్చారు. కాశ్మీర్ భారత్ లో భాగం కాదు అంటున్న పాక్ లాంటి వారు ఇన్నాళ్ళు భారత్ బడ్జెట్ తో నడచిన కాశ్మీర్ కధను మరచిపోతున్నారు.  ఇన్నాళ్ళూ  లక్షల  కోట్లను దోచి పెట్టి కాశ్మీర్ కి బడ్జెట్ గా ఇచ్చిన నాడు మీకేంటి సంబంధం అని భారత్ ని ఎవరూ అడగలేదు. 


సొమ్ము తిన్న కాశ్మీరీలు భారత్ పౌరులు కారా మారి. ఇక్కడ సొమ్ము తిని పాకిస్థాన్ పౌరులవుతారా. ఇదే మాట అంటున్న పాక్  అధ్యక్షుడు  మరింతగా రెచ్చిపోవాలనే మోడీ ఎదురుచూస్తున్నారు. ఓ విధంగా మోడీ వెయిటింగ్ అంటున్నారు. పాక్ అక్కసుతో కానీ ఆగ్రహంతో  కానీ భారత్ మీద దాడికి వస్తే చాలు పీచమణిచేందుకు మోడీ గత అయిదేళ్ళుగా వెయింటింగ్ చేస్తున్నారు.  ఈసారి దెబ్బ  అలా ఇలా ఉండదుగా. తమషా చూపించేందుకు మోడీ రెడీ అంటున్నారు. 


ఏకంగా ఆక్రమిత కాశ్మీర్ దాటి మరీ పాక్ మూకలకు గట్టిగా బుద్ధి చెప్పాలని భారత్ డిసైడ్ అయిపోయిందట.  ఆ విధంగా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఆక్రమిత కాశ్మీర్ ని కూడా భారత్ లో కలిపేయాలన్నదే మోడీ ప్లాన్. మరి రెచ్చిపోతున్న పాక్ బరిలోకి దిగినపుడు ఉంటుంది అసలు కధ. పాక్ ఎలాగూ పగతో రగిలిపోతోంది. తనకు తానుగా యుధ్ధానికి సై అంటే భారత్ మాత్రం ఏంచేస్తుంది. గత్యంతరం లేదని చెప్పి లాహోర్ దాక తరిమి  తరిమి కొడుతుంది. అపుడు ప్రపంచ దేశాలు కూడా భార‌త్ ని ఏమీ అనలేవు. ఇదీ మోడీ మాస్టర్ ప్లాన్. మరి పాక్ బరితెగింపునకు సరైన ముగింపు దగ్గర్లోనే వుందిట.



మరింత సమాచారం తెలుసుకోండి: