రాయలసీమ బిడ్డగా జగన్ కనిపిస్తారు. ఆయనకు అన్ని ప్రాంతాలు అభివ్రుధ్ధి చెందాలని ఉంటుంది. జగన్ మాటలో కూడా సీమ యాస స్పష్టంగా కనిపిస్తుంది. అందరినీ అన్నా అంటూ సంభోధించడంలోనే జగన్ ప్రేమాభిమానాలు తెలుస్తాయి. ఇక జగన్ ఏపీలోని పదమూడు జిల్లాల సర్వతోముఖాభివ్రుధ్ధికి కంకణం కట్టుకున్నారు. చంద్రబాబు తొలి సీఎంగా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారు. కేవలం రెండు జిల్లాల పైనే తన శ్రధ్ధ అంతా చూపించారు.


జగన్ ఆ తప్పులు చేయకూడదని భావిస్తున్నారు. ఈ నేపధ్యంలో రేపు స్వాతంత్ర వేడుకల్లో జగన్ ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా జెండా వందనం స్వీకరించనున్నారు. ఈ సందర్భంగా ఆయన ఏపీ ప్రజలను ఉద్దేశించి ప్రసంగం చేస్తారు. మరో మారు తన ప్రభుత్వ ప్రాధాన్యతలు చాటి చెబుతారు. ఇక కొన్ని వరాలు కూడా సీఎం ఇదే వేదిక మీద నుంచి ప్రకటించే అవకాశం ఉంది.


అందులో అతి ముఖ్యమైనది, సంచలనాత్మకమైనది ఒకటి ఉంది. అదే రాయలసీమకు హైకోర్టు. కర్నూల్లో హైకోర్టు పెట్టాలన్నది అక్కడి ప్రజల చిరకాల డిమాండ్. చంద్రబాబు సర్కార్ దాన్ని కాదని అమరావతిలో హైకోర్టు పెట్టింది. రాయలసీమకు అన్యాయం జరిగిందన్న బాధ వారిలో ఉంది.  జగన్ ఆ తప్పుని సరిచేయబోతున్నారని అంటున్నారు. నిజానికి శ్రీభాగ్ ఒప్పందంలో భాగంగా రాజధాని కోస్తాకు ఇస్తే సీమకు హైకోర్టు ఇవ్వాలి.


ఈ ఒప్పందాన్ని గౌరవిస్తూ జగన్ కర్నూల్ కి హైకోర్టుని బదిలీ చేయబోతున్నారు. అదే సమయంలో విశాఖలో హైకోర్టు బెంచిని కూడా ఏర్పాటు చేస్తారని అంటున్నారు. ఈ రెండు కీలక‌మైన ప్రకటనల ద్వారా అటు సీమవాసులను, ఇటు ఉత్తరాంధ్ర వాసుల మనసులను గెలుచుకోవాలన్నది జగన్ ఆలోచనగా ఉంది. ఇదిలా ఉంటే అమరావతిలో ఉన్న హైకోర్టుని అలాగే ఉంచుతూ సీమకు, విశాఖకు రెండు ప్రత్యేక బెంచ్ లను ఏర్పాటు చేయాలన్న సూచనలు కూడా జగన్ కి వస్తున్నాయట. మరి జగన్ ఏ నిర్ణయం తీసుకుంటారో.


మరింత సమాచారం తెలుసుకోండి: