కాశ్మీర్ అనే పేరు వింటే చల్లటి వాతావరణం,అందమైన ప్రదేశం స్వర్గాన్ని మైమరచేలా అనిపిస్తుంది. అలాంటి కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు తరువాత భద్రత బలగాల రిత్యా మరియు స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఆర్మీ వాళ్ళతో కలకల లాడుతోంది . ఇదిలా ఉంటే కశ్మీర్ లో అంశాల పై సుప్రీంలో పిటిషన్ వేయగా ఈ విషయం లో తాము జోక్యం చేసుకునే ప్రసక్తే  లేదని సుప్రీం కోర్టు సమాధానం తెలిపింది . కేంద్రానికి ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టీకరణ చేశారు. శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని తేల్చి చెప్పిసింది సుప్రీంకోర్ట్.

కశ్మీర్ లో ఆంక్షలపై తాము జోక్యం చేసుకునే ప్రసక్తే లేదని సుప్రీం కోర్టు తేల్చి చెప్తూ ఇది చాలా సున్నితమైన అంశమని వ్యాఖ్యానించింది. కేంద్రం తీసుకుంటున్న చర్యల్ని విశ్వసించవల్సిన అవసరం ఉందని అత్యున్నత న్యాయ స్థానం ప్రకటించింది. కశ్మీరీలతో ఏకం కావటానికి సైన్యం సాయశక్తులా కృషి చేస్తోందని తెలియజేశారు అధికారులు. పాక్ కుట్రల్ని తిప్పి కొట్టడానికి సిద్ధంగా ఉన్నట్టు ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ హెచ్చరించారు. 

సుప్రీం ఆదేశాలతో కేంద్రానికి ఊరట కశ్మీర్ అంశంలో మోదీ సర్కార్ అనుసరిస్తున్న వ్యూహానికి సుప్రీంకోర్టు నుంచి కూడా మద్దతు లభించింది. జమ్మూ కశ్మీర్ లో కేంద్ర మంత్రులతో మానవ హక్కులకు భంగం కలుగుతోందని నేతలను నిర్బంధించారని దాఖలైన పిటిషన్ ను సుప్రీం కోర్టు విచారించింది. ఈ విషయంలో కేంద్రం వాదనను నమ్మాల్సి ఉంటుందని న్యాయ స్థానం వ్యాఖ్యా నించింది. రాత్రికి రాత్రే కశ్మీర్ లో పరిస్థితులు చల్లబడతాయి అనుకోవడం అసాధ్యమని  సుప్రీం కీలక వ్యాఖ్య లు చేసింది. కశ్మీర్ లో పరిస్థితి పూర్తి అదుపు లోనే ఉందని కేంద్రం సుప్రీం కోర్టుకు తెలిపింది.

కశ్మీర్ విభజన ,ఆర్టికిల్ 370 రద్దు తర్వాత కశ్మీర్ లో ఏ హింస చెలరేగలేదని ఒక్క ప్రాణం కూడా పోలేదని తెలిపింది. అయితే కశ్మీర్ లో ఆంక్షలపై కేంద్రానికి సుప్రీం కోర్టు కొన్ని సూటి ప్రశ్నలు వేసింది. సాధారణ పరిస్థితులు నెలకొనడానికి ఎంత సమయం పడుతుందని ప్రశ్నించింది. కశ్మీర్ లో ఏం జరుగుతుందో ఎవరికీ సమాచారం లేదని వ్యాఖ్యానించింది. కేంద్రం ఇచ్చే సమాచారాన్ని నమోదు ఉంటుందని తెలిపింది. కశ్మీర్ లో ఆంక్షలపై పదిహేను రోజుల తరవాత సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. కశ్మీర్ లో పరిస్థితి పూర్తి గా అదుపు లోనే ఉందని తెలిపారు ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్.

కశ్మీరీలను రెచ్చగొట్టడానికి పాక్ కుతంత్రాలు చేస్తోందని,పాకిస్థాన్ కు దిమ్మ తిరిగే జవాబివ్వడానికి భారత త్రివిధ దళాలు సిద్ధంగా ఉందని ఆర్మీ చీఫ్ వెల్లడించారు . అంతే కాక కశ్మీర్ పౌరులుతో భారత సైన్యానికి సత్సంబంధాలున్నాయని ఆయన స్పష్టంజేశారు . ఎల్ వోసీ దగ్గర భారీగా పాకిస్థాన్ బలగాలు మోహరించిన విషయాన్ని భారత సైన్యం గుర్తించిందని ఆయన తెలిపారు.  లడాక్ లో కూడా యుద్ధ విమానాల్లో తరలించిన విషయం పై సమగ్రమైన సమాచారం ఉందని చెప్పగా పాకిస్థాన్ సైన్యం ఎల్ వోసీ వైపొస్తున్నా విషయం కూడా తాము గుర్తించినట్టు వెల్లడించారు మన ఆర్మీ చీఫ్.

భారత సరిహద్దు లోకి చొరబడే ప్రయత్నం చేస్తే పాక్ బలగాలకు సరైన సమాధానం చెప్పేందు కు భారత బలగాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. పాక్ సైన్యం విషయంలో కఠినంగా ఉంటామని కశ్మీర్ ప్రజలతో మాత్రం ఆయుధాలు లేకుండానే కలవటానికి ఆర్మీ ఎప్పుడూ సిద్ధంగా ఉంటూ వారిని ధైర్యంగా ఉండేలా చేస్తామన్నారు. కశ్మీర్ లో తాజా పరిస్థితి పై పాక్ ప్రభుత్వం తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్న విషయం తమకు తెలుసని ఆయన తెలిపారు. కశ్మీర్ లో ఎటువంటి ఉద్రిక్తతలు లేవని సాధారణ పరిస్థితులే ఉన్నాయని ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ స్పష్టం చేశారు.

అంతర్జాతీయ దేశాల నుంచి కశ్మీర్ విషయంలో ఎలాంటి మద్దతు లభించకపోవడంతో పాకిస్థాన్ తీవ్ర వత్తిడికి లోనవుతోందని ఆర్మీ చీఫ్ వ్యాఖ్యా నించారు. ఆగస్ట్ 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండేలా చూడడానికి మన త్రివిద దళాలు గట్టి భద్రతతో శాంతియుతంగా ఉండేలా సిద్దంగా ఉన్నాయి.ఇలాంటి సందర్భాలలో ఆగస్ట్ 15 ఎలా జరుగుతుందనేది వేచి చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: