Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Aug 19, 2019 | Last Updated 10:08 am IST

Menu &Sections

Search

దేశంలోనే అవినీతిరహిత పాలన కోసం .. జగన్ !

 దేశంలోనే అవినీతిరహిత పాలన కోసం .. జగన్ !
దేశంలోనే అవినీతిరహిత పాలన కోసం .. జగన్ !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి  అవినీతి పై తన వైఖరిని మరొక్కసారి చాల స్పష్టంగా తెలియజేసారు. ఈ రోజు మంత్రివర్గ ఉపసంఘంతో భేటీ అయిన జగన్  తన పై కూడా ఎన్నో ఒత్తిళ్లు ఉన్నాయని, అయినప్పటికీ అవినీతి పై పోరాటంలో ఏమాత్రం వెనకడుగు వేయొద్దని తన పార్టీ నాయకులకు ఆయన స్ఫష్టం చేశారు.  గత ప్రభుత్వం నిర్వహించిన టెండర్ల దగ్గర నుండీ  తీసుకువచ్చిన అప్పుల వరకూ.. ప్రతిదానిలో  వందల కోట్ల రూపాయాల్లో కుంభకోణాలు జరిగాయని  అందుకే వాటి పై విచారణ జరిపుతున్నామని చెప్పారు.  జగన్ ఇంకా మాట్లాడుతూ.. మనం ప్రజాధనానికి కాపలాదారులుగా ఉండాలని.. అప్పుడే అవినీతి చేసినవారి పై మనం పోరాడగలమని.. ఉదాహరణకు గత ప్రభుత్వంలో ఇళ్ల నిర్మాణంలో బాబు ప్రభుత్వం  అవినీతి  చేసిందని.. నిజానికి అవినీతి లేకుండా ఉండి ఉంటే..  అదే ఇళ్లు, తక్కువ ఖర్చుకు ప్రజలకు లభించేవి అని జగన్ చెప్పుకొచ్చారు.  మొత్తానికి జగన్   దేశంలోనే అత్యున్నత విధానాలతో అవినీతిరహిత పాలన కోసం బాగానే కష్టపడుతున్నాడు.  మరి జగన్ అనుకున్నది సాధించగలడా ? ఒక్కటి మాత్రం నిజం.  జగన్ తన ప్రభుత్వ హయాంలో ఎలాంటి అవినీతి జరగటానికి వీలులేదని..  అవినీతి చేస్తే... తన సొంత పార్టీ నాయకుల్ని కూడా ఉపేక్షించేది లేదని..   ఆ ప్రకారం జగన్  ఇప్పటికే కఠిన నిర్ణయాలు తీసుకున్నాడు.  


మరి మొన్న ఎలెక్షన్స్ లో 50 - 60 కోట్లు ఖర్చు పెట్టి గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ డబ్బు రాబట్టుకోకుండా ఉంటారా ?  ఉంటే..  వచ్చే ఎలెక్షన్స్ కి  మళ్లీ డబ్బులు ఎలా ? అయినా జగన్ పార్టీ నిలబడటానికి   తామూ తొమ్మిది సంవత్సరాలు కష్టపడితే  మాకు కలిగిన లాభం ఏమిటి అని వైసీపీ నాయకులు ఆలోచించకుండా ఉంటారా ? అధికారంలోకి వస్తే ఎలాగూ సంపాదించుకోవచ్చు అని గతంలో  వైసీపీ నాయకులు విచ్చలవిడిగా ఖర్చు పెట్టారు. ఇప్పుడు జగన్ వారందరి సంపాదనకు అడ్డుగోడగా నిలబడితే.. వాళ్ళు చూస్తూ ఆగుతారా.. ఖచ్చితంగా  వాళ్ళు అవకాశం కోసం కొందరు ఎదురుచూస్తారు. మరికొందరు ప్రత్యర్థి పార్టీలతో లోపాయికారిగా చేతులు కలుపుతారు.  అప్పుడు జరిగే పరిణామాలను  ఇప్పటికే 1984లో  ఎన్టీఆర్ విషయంలో చూశాం.  జగన్ నిర్ణయాల పట్ల కొందరి వైసీపీ నాయకుల్లోనే వ్యతిరేకత మొదలైంది. ఆలాగే బడా వ్యాపారులు, దళారులు, ప్రవైట్ వ్యక్తులు బాగా నష్టపోతున్నారు.  పైగా  బాగా అవినీతికి అలవాటు పడిన అధికారులు ఇప్పటికే లోలోపలే  అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇవ్వన్నీ పరిశీలిస్తే.. జగన్ బలమే బలహీనతగా మారుతుందేమో అనిపిస్తోంది.  


jagan
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
నో డౌట్.. ప్రభాస్ ది   ప్రేమ పెళ్లే ?
'చాణక్య'  ఎక్కడా కాంప్రమైజ్ కావట్లేదుగా !
ప్చ్.. అవే డైలాగ్ లు ఇంకెన్నాళ్లు  పవనూ..  ?
కొరటాల సినిమాలో మెగాస్టార్ ఒక్కరిగానే  !
బ్యాంకాక్ లో  బికినీ భామతో బాలయ్య !
'జగన్' వెంట తోకనేత ఎందుకు వెళ్లలేదు ?
యూఎస్‌ లో 'సాహో' పరిస్థితి దిగజారినట్టేనా ?
'నేచురల్ స్టార్' ఈ సారి ఫుల్  కామెడీతో !
 'సరిలేరు నీకెవ్వరు'..  నువ్వే హైలెట్ !
ఆ హీరో పెళ్లి   'కన్ స్ట్రక్షన్' కంపెనీ వారసురాలితోనేనా ?
'బాబు' శైలి ప్రణాళికలు ఎక్కడా ?
'జగన్' తప్పుడు నిర్ణయానికి  ఆర్థిక  సాయం !
వాళ్ళూ మారితే  జగన్ కే మంచింది !
బాలీవుడ్ కి ప్రేరణ  టాలీవుడే అవ్వనుందా ?
 దేశంలోనే అవినీతిరహిత పాలన కోసం .. జగన్ !
 మెగా మేకింగ్ ట్రీట్  వచ్చేసింది.. అలాగే 20న.. !
డబ్బింగ్ లో 'చాణక్య'..  అలాగే వచ్చే వారం నుండి  !
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.