మొన్న జరిగిన 2019 సార్వత్రిక ఎన్నికల్లో  గతంలో ఎన్నడూ లేని విధంగా టిడిపి ఘోర పరాజయాన్ని మూటగట్టు కుంది. పంతొమ్మిది వందల తొంభై నాలుగు సార్వత్రిక ఎన్నికల ముందు జోడు పదవులు ఉండకూడదంటూ ఎమ్మెల్యే లు జిల్లా అధ్యక్షులుగా ఉన్న ప్రాంతాల్లో పలు  మార్పు లు ప్రవేశపెట్టారు. అప్పట్లో చేపట్టిన ఈ ప్రక్రియ మెరుగైన ఫలితాలని ఇచ్చింది.


అధ్యక్షులను తొలగించి వారి స్థానాల్లో కన్వీనర్ లను నియమించింది, కొన్ని ప్రాంతాల్లో కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించింది. ఈ విధానం ఫలించి అప్పట్లో టీడీపీ మళ్ళీ తిరిగి అధికారం లోకి వచ్చింది. అదే విధంగా పార్టీ ప్రస్తుతం ఎదుర్కొంటున్న  ఈ గడ్డు పరిస్థితుల్లో కొత్త నాయకత్వాన్ని మళ్ళీ తెరమీదకు తేవాలనే ఉద్దేశం తో చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 


పార్లమెంటరీ నియోజక వర్గాన్ని ప్రాతిపదికగా తీసుకొని నూతన కమిటీ లను ఏర్పాటు చేస్తే పార్టీ ల్లో వికేంద్రీకరణ జరుగుతుంది, ఎక్కువ మంది కార్యకర్తల కు పార్టీ పదవులు వస్తాయని క్యాడర్ చెబుతోంది. ఈ విషయం పై ఇంకా పూర్తి నిర్ణయం తీసుకోలేదని జిల్లా కమిటీ లను కొనసాగిస్తూనే వాటికి అనుబంధం గా పార్లమెంటరీ నియోజక వర్గ స్థాయి కమిటీ లను లేక జిల్లా కమిటీ లను పూర్తి స్థాయి లో రద్దు చేసి వాటి స్థానం లో పార్లమెంటరీ నియోజక వర్గ స్థాయి కమిటీ లను పెట్టాలా అనే అంశంపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. 


ఇక అనుబంధ కమిటీ లను పూర్తి స్థాయి లో పటిష్ట పరచి ప్రజల్లోకి వెళ్లే విధంగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు అధికారం లో ఉన్నప్పుడు వేరు ఇప్పుడు వేరని పనిచేసేవారికే పదవులనీ అధినేత స్పష్టం చేసినట్లు సమాచారం. తెలుగు దేశం పార్టీ ని క్షేత్ర స్థాయి లో పటిష్ట పరిస్తే బాగుంటుందనీ అధినేత భావిస్తున్నారని పార్టీ వర్గాల సమాచారం. మరోవైపు టిడిపి లో గోడ మీద పిల్లి లా ఉండే  నేతలకు  పక్కన పెట్టి కొత్త నాయకత్వాన్ని తెర పైకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: