చదువుల తల్లి అయిన సరస్వతి దేవీ  కొలువై ఉన్న ప్రదేశం నిర్మల్ జిల్లాలోని బాసర సరస్వతి ఆలయం.శ్రావణ మాసం సందర్భంగా మరుయు వరుస సెలవుల కారణంగా ఆలయం భక్తుల రద్ధీతో కిటకిటలాడుతోంది. బాగా కురిసిన వర్షాల కారణంగా అధికారుల నిర్లక్ష లోపం వల్ల ఆలయల ప్రాంగణంలో కనీసం ప్రదక్షణ కూడా చేయాలేక భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అధికారుల నిర్లక్షం కారణంగా రోజురోజుకు బాసర ఆలయం తీవ్ర వివాదాలకు తావునిస్తోంది. ఇదిలా ఉండగా మళ్లీ  ఇటీవలే ఒక కొత్త వివాదంలో చిక్కుకుంది బాసర ఆలయం.


ఆలయ అధికారులు అర్చకులు వీఐపీ సేవలో తరిస్తున్నారు. వీఐపీల కోసం ఏకంగా అమ్మవారికి రోజువారీ సేవలు కూడా సమయాన్ని జరపడం లేదని భక్తులు ఆవేదం వ్యక్తం చేస్తున్నారు.  జిల్లా  చైర్ పర్సన్ విజయలక్ష్మి కుటుంబ సభ్యులతో అమ్మ వారి దర్శనానికి వచ్చారు వారికి ఆలయ అధికారులు అర్చకులు ఘన స్వాగతం పలికి ఆలయలోకి తీసుకొచ్చారు. అప్పటికే నైవేద్యం సమర్పించాల్సిన సమయం మించిపోయింది. ప్రతి రోజూ విధిగా మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషా లకు నైవేధ్యం సమర్పించడం ఆచారం.కానీ అమ్మ వారికి సేవలు మరచి జడ్పీ చైర్ పర్సన్ కుటుంబ సభ్యులకు ఆలయ ప్రధాన అర్చకుడు స్వయంగా ప్రత్యేక పూజలు జరిపించారు.పూజలు పూర్తి అయ్యేసరికి ఒంటిగంటయ్యింది. వారికి ఆశీర్వచనాలు సన్మానాలూ తీర్థప్రసాదాల వితరణ తరువాత తీరిగ్గా నైవేద్యం సమర్పించారు ఆయల అర్చకులు. దీంతో మరోసారి వీఐపీ సేవ లో తరిస్తూ విమర్శల పాలయ్యారు బాసర ఆలయ అధికారులు.



గతేడాది జూన్ ఇరవై తొమ్మిదిన అప్పటి శాసన సభ స్పీకర్ మధుసూదనా చారి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అమ్మ వారిని దర్శించుకున్నారు.ఆలయ అధికారి సిబ్బంది అర్చకులు ప్రముఖుల సేవలు నిమగ్నమయ్యారు ఫలితంగా ఆ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషా లకు అమ్మ వారికి సమర్పించాల్సిన నైవేద్యం ఆలస్యమైంది ఒంటి గంట తరువాత పండితులు అమ్మ వారికి నైవేద్యం సమర్పించడం పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఇప్పుడు కూడా ఇలాంటి ప్రముఖుల సేవల్లో మునిగిన అర్చకులు కనీసం అమ్మవారిని కూడా నిర్లక్షం చేయడం పట్ల ఆలయ అధికారులు చెర్యలు తీసుకోకపోవడం పై ఇకనైనా పద్ధతి మార్చుకోవాలంటూ  భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: