ఆడపిల్లలంటే ముద్దుగా రెండు జడలు వేసుకొని చక్కటి వస్త్రాలంకరణతో కనిపించాలని ప్రతి తల్లిదండ్రులు కోరకుంటారు. ఇక మంచిగా జడలు వేసుకుని స్కూలుకి వెళ్లాలని విద్యార్ధినిలు కోరుకుంటారు. అయితే నీటి కొరత అక్కడి విద్యార్థుల ఆశలను నిరాశ చేసింది. విద్యార్థినులు..అబ్బాయిల్లా కటింగ్ చేసుకునే పరిస్థితి ఏర్పడింది.  నీళ్లు లేవన్నసాకుతో విద్యార్థినుల తలనీలాలను సగానికి కట్ చేయించిన ఒక పాఠశాల ప్రిన్సిపాల్ నిర్వాకం మెదక్‌లో  వెలుగులోకి వచ్చింది.  మెదక్ జిల్లా కేంద్రంలోని గిరిజన మినీ గురుకుల పాఠశాలలో ఈ ఘటన జరిగింది.


హాస్టల్‌లో నీటి కొరత ఏర్పడడంతో విద్యార్థినిలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కేవలం నీటి కొరత ఉందన్న కారణంగా అమ్మాయిల చుట్టు కత్తిరించడంపై ఆ పాఠశాల ప్రిన్సిపాల్ కత్తిరించడంపై తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి.  మెదక్ పట్టణంలోని మినీ గురుకుల పాఠశాలలో ఒకటి నుంచి 6వ తరగతి వర కు సుమారు 180 మంది విద్యార్థినులు చదువుకుంటున్నారు.కాగా పాఠశాల ప్రిన్సిపాల్ అరుణారెడ్డి హాస్టల్‌లో నీళ్లకు కొరత ఏర్పడిందన్న కారణంతో 128 మం ది విద్యార్థినులు వద్దని మొత్తుకుంటున్నా వినకుం డా బలవంతంగా వారి జుత్తును సగంకత్తిరించారు.


బక్రీద్ సందర్భంగా సోమవారం స్కూల్‌కి సెలవు కావడంతో తల్లిదండ్రులు పిల్లల్ని చూడటానికి హాస్టల్‌కి వచ్చారు. బాయ్ కటింగ్ లో కన్పించిన తమ పిల్లలను చూసిన తల్లిదండ్రులు షాకయ్యారు.   దీంతో కోపోద్రిక్తులైన తల్లితండ్రులు పాఠశాల సిబ్బంది, ఆయాపై చేయి వేసుకున్నారు. అనుమతిలేకుండా ఆడపిల్లలకు జుత్తు ఎలా కట్ చేస్తారని ప్రిన్సిపాల్‌పై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం పట్టణ పోలీసులకు వారు ఫిర్యాదు చేశారు.


అయితే వెంట్రుకలు కట్ చేసిన విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్త పడాలని ప్రిన్సిపాల్ అరుణారెడ్డి ముందుగానే సిబ్బందిని హెచ్చరించగా ఉపాధ్యాయులు కూడా ప్రిన్సిపాల్ మాటను జవదాటకుండా జాగ్రత్త పడ్డారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన అనంతరం బాధిత విద్యార్థినుల తల్లితండ్రులు మీడియాతో మాట్లాడుతూ రానున్న రెండు నెలల్లో పండగ ఉందని, తమ పిల్లల తలానీలాలను సమర్పిస్తామని దేవుడికి మొక్కుకున్నామని వారు వాపోయారు. 

ఇక ప్రిన్సిపల్ అరుణ వివరణ :

గత కొంత కాలాంగా  మినీ గురుకులంతో తీవ్ర నీటి ఎద్దడి ఉందని, 180 మంది విద్యార్థులకు నీరు అందించడం చాలా కష్టమవుతుందని..ఈ కారణంతో  విద్యార్థినుల తలలో పేలు ఎక్కువైనందున ఆరోగ్య రీత్యా జుట్లు కత్తిరించామని ప్రిన్సిపాల్ అరుణారెడ్డి తెలిపారు. ముందస్తుగా ఆర్సీవో సత్యనారాయణ అనుమతితోనే విద్యార్థినుల ఆరోగ్య రీత్యా వెంట్రుకలు కత్తిరించామని ఆమె వివరణ ఇచ్చారు.



మరింత సమాచారం తెలుసుకోండి: