కేరళ రాష్ట్రంలో విపరీతమైన వరదల  నేపథ్యంలో  రైతుల కోసం పంట రుణాలు తిరిగి చెల్లించే అవకాశాన్ని డిసెంబర్ 31 వరకు పెంచాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్‌కు ఒక లేఖ రాశారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం కేరళ వరదల్లో మరణించిన వారి సంఖ్య 95 కి చేరింది,  ఆగస్టు 8 నుంచి 1.89 లక్షల మంది ప్రజలు వరదల వల్ల నిరాశ్రయులయ్యారు. 1,118 శిబిరాల్లో అనేక మంది ఆశ్రయం పొందారు, వీరిలో కొందరిని వయనాడ్‌కు చెందిన లోక్‌సభ ఎంపి గాంధీ సందర్శించారు.


 సోమవారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) గవర్నర్‌కు రాసిన లేఖలో రాహుల్ గాంధీ  కేరళ ఒక శతాబ్దం లో అత్యంత ఘోరమైన వరదలను చూసింది మరియు  వినాశకరమైన ఈ వరదల  ప్రభావం వల్ల ఎక్కువ సంఖ్య లో పంటలు నాశనం  అయ్యాయి. దీని వల్ల వ్యవసాయ రుణాలను తిరిగి చెల్లించడం లో రైతుల కు కొంచం ఎక్కువ సమయం  కావాలి. అధికారిక సమాచారం ప్రకారం, ఇప్పటి వరకు 1,057 ఇళ్ళు పూర్తిగా దెబ్బతిన్నాయి  11,159 ఇళ్ళు వరదలో పాక్షికంగా నాశనమయ్యాయి.

పండించిన పంటల ధర గణనీయంగా తగ్గడం వంటి ఇతర అంశాలు కూడా రైతులు తిరిగి నిలదొక్కుకునే  సామర్థ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తున్నాయని ఆయన అన్నారు. "సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఆస్తులు మరియు ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీస్ ఇంటరెస్ట్ యాక్ట్, 2002 (సర్ఫేసి చట్టం) ప్రకారం నిస్సహాయ రైతులపై బ్యాంకులు రికవరీ చర్యలను ప్రారంభించిన తరువాత, రైతు ఆత్మహత్యలు కేరళలో ఎక్కువగా ఉన్నాయి" అని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ పేర్కొన్నారు. "రుణాలు తిరిగి చెల్లించడంపై తాత్కాలిక నిషేధాన్ని 2019 డిసెంబర్ 31 వరకు పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం మరియు ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేసినప్పటికీ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ కమిటీ ఈ డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకోవడానికి నిరాకరించింది.

"అప్పుని తిరిగి చెల్లించే సమయాన్ని 2019 డిసెంబర్ 31 వరకు పొడిగించడానికి చర్యలు తీసుకోవాలని నేను ఆర్బిఐని అభ్యర్థిస్తున్నాను" అని దాస్ కి రాసిన లేఖలో రాహుల్ పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకుడు సోమవారం కేరళలోని తన వయనాడ్ లోక్సభ నియోజకవర్గంలో వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు,  విపత్తుతో నష్టపోయిన వారికి అన్ని విధాలుగా సహాయం చేస్తామని హామీ ఇచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: