ఇంట్లో నుంచి అడుగు బయటపెట్టాలంటే భయం ఆఖరికి ఇంట్లో ఉండాలన్నా భయమే వరదలు పోటెత్తుతున్నాయి.వరదలలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోతున్న ప్రజలు కొదరైతే,వరదల వల్ల కొట్టుకొచ్చిన వణ్య ప్రాణుల వల్ల ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య రోజు రోజుకు ఎక్కువవుతోంది. కనిపించిన వారందరినీ కరిచేస్తున్నాయి. జనావాసాల మధ్యకు వచ్చేస్తున్నాయి. ఒక్క కాటుతో ప్రాణాలు తీసేస్తున్నాయి.


తాజాగా మోపిదేవి మండలం శీవరాంపురం గ్రామంలో ఐదుగురు కూలీలు పాము కాటుకు గురయ్యారు. పొలంలో నాట్లు వేస్తున్న సమయంలో ఐదుగురినీ కరిచేశాయి. వీరిలో ఇద్దరు చల్లపల్లి ప్రభుత్వాసుపత్రికి వెళ్లగా మరో ముగ్గురు నాటు వైద్యాన్ని వెళ్లారు. కృష్ణా జిల్లాలో పాముల బుసలు కొడుతున్నాయి. ఏ హాస్పిటల్ కు వెళ్లిన పాముకాటు కేసులే కనిపిస్తున్నాయి. గడిచిన ఏడు నెలల్లో జిల్లా వ్యాప్తంగా నాలుగు వందలకు పైగా పాముకాటు కేసులు నమోదయ్యాయి. ఒక్క అవనిగడ్డ నియోజకవర్గంలోనే అత్యధికంగా మరణాల సంఖ్య నమోదైంది.


ఇప్పటి దాకా పది మందికి పైగా మృతి చెందారు. అవనిగడ్డ, నందిగామ, మచిలీపట్నం చుట్టు పక్కల గ్రామాల్లో పాములు మాటు వేసి కాటేస్తున్నాయి.


కృష్ణా జిల్లాలో పాము కాట్ల స్పందించిన అటవీ శాఖాధికారులు అవనిగడ్డలో అవగాహన సదస్సును కూడా ఏర్పాటు చేశారు.స్నేక్ సొసైటీ సభ్యులు ఎనిమిది రకాల పాములు తీసుకొచ్చి మరీ పాము కరిచినపుడు తీసుకోవాల్సిన చర్యలు, అసలు ఎన్ని రకాల పాములు ఉంటాయో వివరించారు. పాము కాటుకు గురైనప్పుడు కంగారు పడకుండా వెంటనే డాక్టర్ దగ్గరకు వెళ్లాలని సూచించారు.మరోవైపు పాము కాట్లకు ఇంకా నాటు వైద్యాన్ని అనుసరిస్తున్నారు జనాలు. తాజాగా జరిగిన ఈ ఘటనలో కూడా ముగ్గురు నాటు వైద్యాన్నే నమ్ముతున్నారు. అందుకే మరణాల సంఖ్య పెరుగుతోందని అటవీ శాఖాధికారులు వెల్లడించారు.


పాముకాటుకు  గురైనప్పుడు నాటుమందు అనేది ఎటువంటి పరిస్థితుల్లో పనిచేయదంటే ఎటువంటి విషపూరితమైన పాము కరిచిందని అంటే మాత్రం యాంటీ వీనం స్నేక్ ఇంజెక్షన్ మాత్రమే దానికొక నివారణ వేరే మందులు ఇటువంటి పనిచేయదు కరిచిన వెంటనే అది ఏ పాము కరిచిన ఏం జరిగిన డాక్టరు దగ్గరికి రక్తప్రసారం  జరగకుండా తీసుకెళ్తే మాత్రమే ఖచ్చితంగా  ప్రాణాన్ని బతికించవచ్చనేది ఒక ఉద్దేశం. నాటు మందులనూ ఉపయోగిస్తూ సమయాన్ని వృధా చేసి ఆ బాధితుడి ప్రాణానికి మరింత ముప్పు తేకూడదని గూడెం రైతులకు తెలియజేస్తున్నారు అటవి శాఖ అధికారులు.


అతనికి ధైర్యం చెప్పి ఆస్పత్రుల్లో వెనువెంటనే చర్చి యాంటీ వీనం ఇంజక్షన్ మాత్రమే నని నివారణ కాబట్టి ఇవ్వాల్సిందిగా తెలియజేశారు.కొన్ని విషపూరితమైన పాములైతే తెలిస్తే వెంటనే ఒకసారి చాలా స్పీడుగా రక్తంలోకి విషమెక్కి అవకాశముంది కాబట్టి ఆ పామును చూసిన వెంటనే ఆ పాముకు చెప్పగలిగితే డాక్టరు వెనువెంటనే ఎంత మోతాదులో అయితే ఇంజక్షన్ ఇవ్వడంతో మోతాదుని బట్టి ఇచ్చి ప్రాణాన్ని బతికించే అవకాశం ఎక్కువ ఉంటుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: