ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయంతో ఎనర్జీ వివాదం రాజుకుంటుందని చెప్పారు. ప్రస్తుత పరిణామాల బట్టి చూస్తే.. ఏపీలో మొత్తానికి రెన్యూవబుల్ ఎనర్జీ టారిఫ్‌ల విషయంలో ఆంధ్ర ప్రదేశ్ వైఖరిపై వ్యతిరేకత వస్తోంది. ముఖ్యమంత్రి జగన్‌కు జపనీస్ అంబాసిడర్ లేఖ రాసినట్టు సమాచారం. రెన్యూవబుల్ ఎనర్జీ టారిఫ్‌ల విషయంలో ఆంధ్ర ప్రదేశ్ వైఖరిపై జపాన్ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసింది. ప్రస్తుతం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను నిశితంగా పరిశీలిస్తున్నామని తెలిపిన జపాన్ రెన్యూవబుల్ ఎనర్జీ సెక్టార్ అంశంపై వైఎస్ జగన్‌కు జపనీస్ అంబాసిడర్ లేఖ రాశారు.




ప్రభుత్వానికి పలు సూచనలు చేశారు. సైన్ అండ్ సీల్ చేసిన కాంట్రాక్ట్‌లను రివ్యూ చేయడం వల్ల పెట్టుబడుల వాతావరణంపై ప్రభావం చూపుతుందని జపాన్ అభిప్రాయపడింది. ఇలాంటి చర్యలతో ఫారిన్ ఇన్వెస్టర్లలో భయాందోళనలు నెలకొంటాయని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇండియా రెన్యూవబుల్ సెక్టార్‌లో ఫారిన్ ఇన్వెస్ట్‌మెంట్స్ భారీగా వస్తున్నాయని న్నారు. ఇలాంటి సమయంలో నిర్ణయం సరైంది కాదన్నారు. 
ఫ్రాన్స్, సౌత్ ఆఫ్రికా, యూరోప్ కంపెనీలు టెండర్లలో పాల్గొంటున్నాయి. ఇప్పటికే జపాన్ పలు ఒప్పందాలు చేసుకుందన్నారు.  ఇప్పటికే ఈ విషయంలో రాష్ట్రప్రభుత్వానికి పలు వర్గాల నుంచి లేఖలు వచ్చాయి.




కేంద్ర ప్రభుత్వం కూడా ఇదే విషయమై రాష్ట్ర ప్రభుత్వానికి పలు సూచనలు చేసింది. ఒప్పందాల విషయంలో సమీక్షలు, రద్దు చేయడం వల్ల దేశీయంగా విదేశీ పెట్టుబడులకు తీవ్ర విఘాతం కలుగుతుందని తెలిపింది. ఇప్పటికే పలు కంపెనీలు కూడా ప్రభుత్వ నిర్ణయంపై కోర్టులను ఆశ్రయించాయి. ఇదిలా ఉండగా రెన్యూవబుల్ ఎనర్జీ విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా అసహనంతో ఉన్న విషయం తెలిసిందే. ఈ విషయంలో ఇప్పటికే కేంద్ర మంత్రులు తమ స్పష్టమైన వైఖరిని వ్యక్తపర్చిన సంగతి కూడా తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో జపాన్ అంబాసిడర్ రాసిన లేఖ ప్రాధాన్యతను సంతరించుకోబోతున్నట్టు పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: