ముఖ్య మంత్రి గారు మన రాష్ట్రము వైపు చూడండీ

 

తెలంగాణ రాష్ట్రము తీవ్ర కరువు తో అల్లాడి పోతోందని, వర్షాలు లేక రైతులు అలమటిస్తున్నారని, కానీ ఇవేమి పట్టని మన ముఖ్య మంత్రి శ్రీ కే చంద్ర శేఖర్ రావు గారు పక్క రాష్ట్రము సమస్యలు నెత్తి మీద వేసుకుంటున్నారని బంగారు తెలంగాణ మాట పూర్తీ గా మర్చి పోయారని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ లక్ష్మణ్ విమర్శించారు.

 

ఒకపక్క తెలంగాణ ఎండిపోతుంటే రాయలసీమ ను రతనాల సీమ చెయ్యడం గురించి కెసిఆర్ గారు ఆలోచించడం ఏమిటని అడిగారు.  రాష్ట్ర సమస్యలు మరచి పోయారని,  శ్రీ కెసిఆర్ ను ఉద్దేశించి ఘాటుగా విమర్శించారు.  వానలు లేక బాధ పడుతున్న రైతన్నకు సహాయం చేయ వలసిన తరుణం ఆసన్నమైనది అని శ్రీ లక్ష్మణ్ అన్నారు.

 

తెలంగాణ రాష్ట్రము లో భారతీయ జనతా పార్టీ పరిస్థితి చాలా మెరుగుపడిందని, మరింత పుంజుకునే అవకాశం చాలా వున్నదని శ్రీ లక్ష్మణ్ చెప్పారు.  వచ్చే ఎన్నికల లో మరిన్ని స్థానాలు కైవసం చేసుకుంటామన్నారు. భారతీయ జనతా పార్టీ తెలంగాణ లో అధికారం చేపట్టే రోజు కూడా దగ్గర లోనే వున్నదని అభిలాషించారు.  తెలంగాణ రాష్ట్రములో జరిగిన సభ్యత్వ నమోదు కార్యక్రమం లో ప్రజా స్పందన ఎంతో బాగున్నది అని కేంద్రం లో ప్రధాని నరేంద్ర మోడీ పని తీరు కూడా ఎక్కడ మా విజయావకాశాలను రెట్టింపు చేసిందన్నారు.  ప్రధాని నరేంద్ర మోడీ చేపట్టిన అభివృద్ధి పనులు మన రాష్ట్రం లో బీజేపీ దూసుకుపోవడాని కి ఎంతగానో ఉపయోగ పడుతున్నాయని పేర్కొన్నారు.

కాంగ్రెస్ పార్టీ కి ఇంక మనుగడ లేదని చెప్పారు.  అందువల్లే సమర్ధ నాయకత్వం అందించి ప్రజలకు సుస్థిర పాలన ఇవ్వగల బీజేపీ తప్పనిసరిగా ముందడుగు వేస్తుందన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: