జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో పోటీ చేసి పరాజయం పాలయ్యారు.  ఎన్నికల్లో భారీ విజయం సాధిస్తారని అంతా అనుకున్నారు.  కానీ, అనుకున్నట్టుగా విజయం సాధించలేదు.  ఎన్నికలకు నాలుగైదు నెలల ముందు రణరంగంలోకి దిగి ప్రచారం చేయడంతో పవన్ ప్రభావం చూపలేకపోయాడు అన్నది అందరికి తెలిసిందే.  


అయితే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ అదే విషయాన్ని పదేపదే ఉచ్చరిస్తున్నాడు.  ఓటమికి కారణం ప్రచారం చేయడానికి సమయం లేకపోడం అని చెప్పి ప్రతి మీటింగ్ లో చెప్తున్నాడు.  ఇప్పుడు ఓటమికి కారణం ప్రచారం చేసుకునే సమయం లేకపోడమే అని ఇప్పుడు ఎంతగా చెప్పుకున్న ఉపయోగం లేదు.  దాని నుంచి పవన్ కళ్యాణ్ బయటకు వచ్చి.. జరగాల్సిన విషయాల గురించి ఆలోచించాలి. 


ప్రతి గ్రామంలో జనసేన పార్టీకి సంబంధించిన బలం ఉండాలి.  కార్యకర్తలు ఉండాలి.  ప్రస్తుతం రాష్ట్రాన్ని వరద ముంచెత్తుతోంది.  వరద బాధితులను ఆదుకునే దిశగా పవన్ అడుగులు వేయాలి.  పవన్ కార్యకర్తలతో కలిసి ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనాలి.  అప్పుడే పవన్ కళ్యాణ్ వార్తల్లో నిలుస్తాడు. ఇలాంటి సమయంలోనే ప్రజలు దగ్గరైతే దాని వలన ఎన్నికల సమయంలో మేలు జరుగుతుంది.  


గ్రామ స్థాయిలో పవన్ పార్టీ బలపడాలి అంటే మాములు విషయం కాదు.  దానికి గ్రౌండ్ వర్క్ చాలా చేయాల్సి ఉంటుంది.  గ్రామాల్లో పవన్ తప్పకుండా పర్యటించాలి.  అలా చేస్తేనే పవన్ గ్రామాల్లో పోటీ ఇవ్వగలుగుతాడు.  కాబట్టి పవన్ కళ్యాణ్ ఓటమి గురించి ఆలోచించకుండా.. భవిష్యత్తులో పార్టీ విజయం సాధించడానికి తీసుకోవాల్సిన చర్యలు ఏంటి అనే దాని గురించి ఆలోచిస్తే మంచిది.  జగన్ ఎన్నికలకు ముందు మూడేళ్ళ నుంచి ప్రజల్లో ఉన్నాడు.  ప్రజల మధ్యన తిరిగాడు.  ప్రజాసమస్యలపై పోరాటం చేశాడు. ఎన్నికల సమయంలో డబ్బు అన్నది మాములే.  డబ్బులు ఇవ్వకుండా ఓట్లు వేసే రోజులు రావాలి. దానికి ప్రజల్లో మార్పును తీసుకురావాలి.  అంతకంటే ముందు నాయకులు మారాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: