దేశంలో ఇప్పుడు మోడీ తిరుగులేని నాయకుడు.  అందులో ఎలాంటి డౌట్ లేదు.  2014 లో విజయం సాధించిన తరువాత అనేక కఠినమైన నిర్ణయాలు తీసుకున్నారు.  ఆ నిర్ణయాలను మొదట ప్రతి ఒక్కరు వ్యతిరేకించారు.  తరువాత ఆమోదించక తప్పలేదు.  అంతర్జాతీయంగా మోడీ బలం పెరిగిపోయింది.  సరిహద్దు దేశాలతో మైత్రిని పెంచుకుంటున్నాడు.  శత్రువులను ఎక్కడ ఎలా దెబ్బ కొట్టాలో అలా దెబ్బ కొడుతున్నాడు.  

 

అంతర్జాతీయంగా మోడీని అభిమానించే వ్యక్తులు పెరిగిపోతున్నారు. అమెరికాలో మోడీకి ఆదరణ పెరిగింది.  ఇండియాపై ఆధిపత్యం చెలాయించాలని చూసిన చైనా ఇప్పుడు వెనక్కి తగ్గింది.  ఆసియాలో ఇండియా సూపర్ పవర్ గా ఎదుగుతుంది అనడంలో సందేహం అవసరం లేదు.  ఇప్పటి వరకు ఏ ప్రధాని తీసుకొని నిర్ణయాలు తీసుకొని ఇండియాను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు.  

 

దేశాన్ని మార్చే నాయకుడు  ఇండియాలో పుడతాడని 16 వ శతాబ్దానికి చెందిన నోస్ట్రడామస్ చెప్పినట్టు చరిత్ర చెప్తోంది.  ప్రపంచంలో ఇండియాను ఒక బలీయమైన శక్తిగా అవతరింపజేయడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాడని నోస్ట్రడామస్ చెప్పారు.  మనదగ్గర బ్రహ్మంగారు ఎలాంటి వారో.. నోస్ట్రడామస్ అలాంటి వ్యక్తి.  కాలాన్ని అంచనావేసి జరగబోయే విషయాలను ఖచ్చితంగా చెప్పగలిగారు.  

 

చెప్పినట్టుగానే 2014లోను, 2019లోను అధికారంలోకి వచ్చారు.  గత 72 సంవత్సరాలుగా పరిష్కారం కానీ జమ్మూ కాశ్మీర్ సమస్యను ఈజీగా పరిష్కరించారు.  గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి విషయానికి భయపడేది.  ఏ నిర్ణయం తీసుకోవాలి అన్నా ఒకటికి వందసార్లు ఆలోచిందేది.  దీంతో అక్కడ ఒక్క పని కూడా ముందుకు సాగేది కాదు.  కానీ, ఇప్పుడు అలా కాదు.  దేశానికీ ఉపయోగపడుతుంది అనుకుంటే ఎంతటి కఠినమైన నిర్ణయం అయినా సరే తీసేసుకుంటున్నారు.  అందుకు ఉదాహరణ ఆర్టికల్ 370 రద్దు, జమ్మూ కాశ్మీర్ విభజన, త్రిపుల్ తలాక్ చట్టం అమలు.. వీటిపై నిర్ణయాలు తీసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ సాహసించలేదు.  


మరింత సమాచారం తెలుసుకోండి: