బీజేపీ దూకుడును ప్రదర్శిస్తోంది.  దేశవ్యాప్తంగా గతంలో కంటే ఇప్పుడు బీజేపీ హవా ఎక్కువగా ఉన్నది.  2014లో మోడీ విజయం సాధించిన తరువాత మెల్లిగా పార్టీ ఒక్కో రాష్ట్రంలో అధికారం సంపాదించుకుంటూ వచ్చింది. 2018 లో జరిగిన ఎన్నికల్లో కొన్ని రాష్ట్రాల్లో అధికారం కోల్పోయింది.  అయితే, కర్ణాటకలో తిరిగి అధికారంలోకి వచ్చింది బీజేపీ.  


బీజేపీ ముందు ఇప్పుడు అతిపెద్ద లక్ష్యం ఉన్నది.  బెంగాల్ కోటను ఎలాగైనా చేజిక్కించుకోవాలని చూస్తున్నారు.  బెంగాల్ లో పాగా వేయాలని కాంగ్రెస్ పార్టీ చాలా ప్రయత్నించి విఫలం అయ్యింది.  తృణమూల్ అధికారంలోకి రాకముందు అక్కడ వామపక్షాలు అధికారంలో ఉన్నాయి.  పదేళ్ల క్రితం పదేళ్ల క్రితం తృణమూల్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.  


వాజ్ పాయి హయాంలో బెంగాల్ కోటలోకి అడుగుపెట్టే సాహసం చేయలేకపోయారు.  వాజ్ పాయి చేయలేనిది మోడీ చేసి చూపించారు.  2014లో రెండు ఎంపీ స్థానాలు మాత్రమే గెలుచుకున్న పార్టీ 2019 ఎన్నికల్లో ఏకంగా 18 స్థానాలు గెలుచుకుంది.  దీంతో దీదీకి భయం పట్టుకుంది.  వచ్చే ఎన్నికల్లో బెంగాల్ లో అధికారం చేజిక్కించుకోవాలని చూస్తోంది బీజేపీ.  


దీనికోసం పావులు కడుపుతున్నది.  ఇప్పటికే తృణమూల్ కు చెందిన కొంతమంది నేతలు పార్టీ మారిపోయారు.  కోల్ కతా మాజీ మేయర్, తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే, దీదీకి అత్యంత సన్నిహితుడైన సోబన్ ఛటర్జీ బీజేపీలో జాయిన్ అయ్యారు.  ఛటర్జీ పార్టీ మారబోతున్నారు అని తెలిసిన వెంటనే తృణమూల్ నేతలు బుజ్జగించే ప్రయత్నం చేశారు.  శారద కేసులో తృణమూల్ కు కూడా సిబిఐ నోటీసులు జారీ చేసింది.  పార్టీకి ఫండ్ తీసుకురావడంతో పాటు పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించాడు ఛటర్జీ.  2019 లో బీజేపీ విజయం సాధించిన తరువాత తృణమూల్ కు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు, సిపిఎం, కాంగ్రెస్ నుంచి ఒక్కొక్కరుగా బీజేపీలో జాయిన్ అయ్యారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: