ఆర్టికల్ 370 దేశ చరిత్రను, వాతావరణాన్ని, రాజకీయాల భవిష్యత్తును అమాంతం మార్చేసింది.  72 సంవత్సరాలుగా సాధ్యం కానీ విషయాన్ని బీజేపీ పది గంటల్లో తేల్చివేసింది.  ఇలా 10 గంటల్లో జమ్మూ కాశ్మీర్ విషయాన్ని పరిష్కరించడంతో పార్టీపై అందరికి గురి కుదిరింది. దేశంలో ఎలాంటి సాధ్యంకాని విషయాలనైనా బీజేపీ ఈజీగా పరిష్కరిస్తుందని ప్రజల్లో నమ్మకం కుదిరింది.  ఇప్పుడు ప్రతి రాష్ట్రంలోను బీజేపీని ప్రజలు నమ్మడానికి ప్రయత్నం చేస్తున్నారు.  


అసలు పోటీ చేసి ఒక్క సీట్లు గెలుచుకోలేకపోయింది చోట కూడా పార్టీ మనుగడ సాగిస్తోంది.   చేజిక్కించుకునే దిశగా అడుగులు వేస్తున్నది.  అందుకు ఓ ఉదాహరణ సిక్కిం రాష్ట్రం అని చెప్పాలి.  2019 ముందు వరకు ఆ రాష్ట్రంలో ఎస్డిఎఫ్ అధికారంలో ఉండేది.  పవన్ చామ్లింగ్ ఆ పార్టీ అధ్యక్షుడు.  1993లో పార్టీని స్థాపించాడు.  ఆ తరువాత ఏడాది జరిగిన ఎన్నికల్లో చామ్లింగ్ పార్టీ విజయం సాధించింది.  అప్పటి నుంచి 2019 వరకు చామ్లింగ్ ప్రభుత్వం అక్కడ అధికారంలో ఉన్నది.  


2004లో ఆ పార్టీ 32 స్థానాలకు గాను 31 స్థానాల్లో విజయం సాధించింది.   2009 ఎన్నికల్లో 32 స్థానాల్లో విజయం సాధించి క్లీన్ స్వీప్ చేసింది.  అది అతిపెద్ద విజయంగా చెప్పాలి.  2009 తరువాత పాపం చామ్లింగ్ కు ఎదురు దెబ్బలు తగలడంమొదలయ్యాయి.  ఎస్డిఎఫ్ పార్టీలో మంత్రిగా చేసిన ప్రేమ్ సింగ్ తమాంగ్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రిపై ఆరోపణలు చేశారు.  అనంతరం 2013 లో ఆ పార్టీని వీడి సిక్కిం క్రాంతి మోర్చా పార్టీలో జాయిన్ అయ్యాడు.  


అప్పటి నుంచి అంచెలంచెలుగా ఎదిగాడు.  2014 ఎన్నికల్లో పవన్ పార్టీ విజయం సాధించినా.. సిక్కిం క్రాంతి మోర్చా కొన్ని స్థానాలు గెలుచుకున్నది.  ప్రతిపక్షంలో ఉన్న ప్రేమ్ సింగ్ అధికార పార్టీపై విమర్శలు చేయడం మొదలుపెట్టాడు.  అవకాశం దొరికినప్పుడల్లా విమర్శలు చేశారు.  2019 ఎన్నికల్లో పవన్ పార్టీ ఎస్డిఎఫ్ 15 సీట్లు గెలుచుకుంది.  సిక్కిం క్రాంతి మోర్చా 17 సీట్లు తేలుచుకుంది.  అయితే, పవన్ పార్టీకి చెందిన ఇద్దరు నేతలు రెండు స్థానాల నుంచి పోటీ చేసి విజయం సాధించడంతో ఒక స్థానం వదులుకోవాల్సి వచ్చింది.  దీంతో తమంగ్ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు.  



తమంగ్ పార్టీకి అక్కడ బీజేపీ మిత్రపక్షంగా ఉన్నది.  ఇదిలా ఉంటె, 370 అధికరణం రద్దు తరువాత సడెన్ గా సిక్కిం రాష్ట్రంలో మార్పులు జరిగాయి.  పవన్ పార్టీ నుంచి ఏకంగా పది మంది ఎమ్మెల్యేలు బీజేపీలో జాయిన్ అయ్యారు.  ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయిన బీజేపీకి ఇప్పుడు అక్కడ బలం 10కి పెరిగింది.  పవన్ పార్టీలో మిగిలింది ముగ్గురు.  ఈ ముగ్గురిలో ఇద్దరు ఆ పార్టీని వీడి సిక్కిం క్రాంతి మోర్చాలో జాయిన్ అయ్యారు.  దీంతో సిక్కిం ప్రతిపక్షంలో ఒకే ఒక్క ఎమ్మెల్యే ఉన్నారు.  అయన కూడా ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి కావడం విశేషం.  


మరింత సమాచారం తెలుసుకోండి: