జగన్ సర్కారు మరో ప్రక్షాళనకు సిద్ధమవుతోంది. రాష్ట్రంలో అడ్డదిడ్డంగా ఉన్న భూ రికార్డులను క్రమబద్దీకరించబోతోంది. రాష్ట్రంలో ఉన్న భూములన్నింటినీ సమగ్రంగా సర్వే చేయించాలని నిర్ణయించింది. కాలం చెల్లిన రికార్డుల స్థానంలో కొత్తగా డిజిటల్ టెక్నాలజీ రికార్డులను అప్ డేట్ చేయించాలని జగన్ సర్కారు భావిస్తోంది.


సీఎం జగన్ కోరికకు తగ్గట్టుగానే.. భూముల సమగ్ర సర్వేకు సన్నద్ధంగా ఉన్నట్లు రెవెన్యూ శాఖ తెలిపింది. రీసర్వే ప్రణాళికను అధికారులు జగన్ కు వివరించారు. ‘సమగ్ర సర్వే కోసం రూ. 1688 కోట్లతో ప్రతిపాదనలు సిద్దం చేశారు. మొత్తం రాష్ట్ర విస్తీర్ణం 1.63 లక్షల చ.కి.మీలు కాగా, అందులో 1.22 లక్షల చ.కి.మీ మేర సర్వే చేస్తారు. మిగతా 38,8000 చ.కి.మీ అటవీ భూమి కాగా, మరో 2,200 కి.మీ మేర జనావాసాలు ఉన్నాయి.


మొత్తం రాష్ట్రంలో 679 మండలాలు, 17,460 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. మొత్తం ఎఫ్‌ఎంబీలు 49 లక్షలు కాగా, సబ్‌ డివిజనల్‌ రికార్డెడ్‌ ఎఫ్‌ఎంబీలు 159 లక్షలు ఉన్నాయి. అలాగే భూ యజమానులు 2.36 కోట్ల మంది ఉన్నారు. ఇప్పుడు ఇంతగా రీసర్వే చేయాల్సిన అవసరం ఏముందన్న ప్రశ్న తలెత్తవచ్చు. తొలిసారిగా 18801930ల మధ్య రైత్వారీ గ్రామాలపై రికార్డు జరిగింది. ఆ తర్వాత 1960-80 మధ్య మరోసారి సెటిల్‌మెంట్‌ గ్రామాలపై రికార్డు నిర్వహించారు.


అయితే చాలా వరకు రికార్డులు పోవడం, ఉన్నదాంట్లో కూడా సమాచారం సరిగా అప్‌డేట్‌ కాకపోవడం కారణంగా క్షేత్ర స్థాయిలో ఉన్న భూములకీ, రికార్డులకూ పొంతన లేకుండా పోయింది. తమ భూములు సర్వే చేయమంటూ వస్తున్న దరఖాస్తుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఈ తప్పుడు రికార్డుల కారణంగా అనేక భూవివాదలు వస్తున్నాయి. అందుకే ఈ వివాదాలు తగ్గించేందుకు రెవెన్యూ వ్యవస్థపై మీద ప్రజలకు నమ్మకం కుదిరేలాచేసేందుకు సమగ్ర భూసర్వే చేయాలని జగన్ సర్కారు భావిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: