ఆయన్ని బీజేపీ ఉక్కుమనిషిగా చెబుతారు. పార్టీలో ఆయనంత సుదీర్ఘ అనుభవం కలిగిన నేత మరొకరు లేరు. అద్వానీ, వాజ్ పేయ్ బీజేపీకి రెండు కళ్ళు. గత ఏడాది ఆగస్ట్ 16న వాజ్ పేయ్ కన్ను మూశారు. దాంతో బీజేపీ నాడు తీవ్రమైన విషాదంలో మునిగిపోయింది. ఇక నాటి నుంచి వరసగా బీజేపీకి దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. తాజాగా బీజేపీ ఫైర్ బ్రాండ్ సుష్మా స్వరాజ్ కన్ను మూశారు.


ఇపుడు ఎల్కే అద్వానీ మంచాన పడ్డారన్న వార్త కాషాయదళాన్ని కలచివేస్తోంది. అద్వాని వయసు తొంబై దాటినా కూడా అయన ఇప్పటికీ చురుకుగా తిరుగుతూ పార్టీ నేతలకు స్పూర్తిగా ఉన్నారు. సుష్మా స్వారాజ్ మరణం మాత్రం అద్వానీని ఒక్కసారిగా క్రుంగదీసిందని చెబుతారు. తన సొంత కుమర్తెలా ఆమెను అద్వాన్వీ, వాజ్ పేయ్ సాకారు. పార్టీలో చాలా చిన్న వయసు కలిగిన సుష్మ హఠాత్తుగా దూరం కావడం పెద్దాయన జీర్ణించుకోలేకపోతున్నారని అంటున్నారు.


ఇదిలా ఉండగా గత అయిదు రోజులుగా అద్వానీ వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారట. ఆయన మంచం కూడా దిగి నడవలేకపోతున్నారట. ఇన్నేళ్ల జీవితంలో అద్వానీ ఇలా మంచాన పడడం ఇదే తొలిసారి అంటున్నారు. అద్వానీ అనారోగ్యం ఇపుడు బీజేపీలో భయాందోళనలను కలుగచేస్తోంది.


ప్రతీ ఏటా స్వాంతంత్ర వేడుకల్లో పాల్గొనే అద్వానీ ఈసారి రావడంలేదని తెలిసి అభిమానులు, బీజేపీ నాయకులు చాలా బాధపడుతున్నారు. వైరల్ ఫీవర్ ఇన్ని రోజులు అద్వానీని బాధించడమేంటన్న చర్చ కూడా సాగుతోంది. మరి అద్వానీ తొందరగా కోలుకోవాలని, బీజేపీకి పెద్ద దిక్కుగా ఉండాలని అంతా ప్రార్ధిస్తున్నారు.  అద్వానీ పార్టీలో చురుకుగా తిరుగుతూ ఉంటే పార్టీకి ఎక్కడలేని శక్తి వస్తుందని నేతలు అంటున్నారు. కాషాయం పార్టీకి కర్త కర్మ క్రియ లాంటి పెద్దయన మళ్ళీ పూర్తి ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: