దేశం  73వ స్వాతంత్ర దినోత్సవ  వేడుకలు జరుపుకునేందుకు రెడీ అయింది . .  దేశంతో కలిసి ఈ సారి జమ్ము కశ్మీర్ కూడా స్వాతంత్ర దినోత్సవ  వేడుకలు జరుపుకోనుంది . భారత దేశంలోనే అంతర్భాగంగా  ఉంటూ, అక్కడ  మువ్వెన్నల జెండా ఎగురవేయాలంటే గతంలో భయం. కానీ ఈసారి పరిస్థితి పూర్తిగా మారిపోయింది  .కేంద్రం తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయం ద్వారా ఈసారి యావత్ దేశ ప్రజలతో కలిసి కాశ్మీరీలు కూడా స్వాతంత్ర దినోత్సవ  వేడుకలు జరుపుకోనున్నారు .   జమ్మూకశ్మీర్‌ లో స్వయంప్రతిపత్తిని ఎత్తివేసిన తర్వాత,  రాష్ట్రంలో మొదటిసారి జరగనున్న  స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు కేంద్రం సూచనల  మేరకు , స్థానిక అధికారులు   అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు.


 కేంద్ర ప్రభుత్వం జమ్ము కశ్మీర్ లో ఆర్టికల్ 370 ఆర్టికల్ రద్దు చేసిన తరువాత జరుగుతున్న స్వాతంత్ర వేడుకలు ఇవే కావటంతో ఇప్పుడు దేశ ప్రజల అందరి చూపు అటు వైపే ఉంది. ఎలాగైనా స్వాతంత్ర దినోత్సవ వేడుకలను భగ్నం చేయాలని వేర్పాటు వాదుల మద్దతుతో కొందరు స్థానికంగా భయాందోళనలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ, కేంద్రం కఠినంగా వ్యవహరిస్తోంది. జమ్ము కశ్మీర్ ఇప్పుడు కేంద్ర పాలిత ప్రాంతం కావటంతో పూర్తిగా పరిస్థితి కేంద్ర హోం శాఖ పరిధిలో ఉంది. అడుగడుగునా భద్రతా దళాలు మొహరించాయి. ప్రతీ గ్రామంలో త్రివర్ణ పతాకం నిర్బయంగా ఎగుర వేయాలని కేంద్రం సూచించింది. జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ ధోవల్ స్థానికంగా  మకాం వేసి,  పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారు.


 గవర్నర్ సత్యపాల్ మాలిక్ ప్రతి నిమిషం అప్రమత్తంగా ఉంటూ అధికారులకు అవసరమైన మార్గదర్శకాలు ఇస్తున్నారు.  1992లో లాల్ చౌక్ లో నేటి ప్రధాని..నాటి బీజేపీ నేత నరేంద్ర మోదీ బాంబు పేలుళ్ల మధ్య మువ్వెన్నల జెండా ఆవిష్కరించారు. ఇప్పుడు ఆయన కేబినెట్ లోని హోం మంత్రి అమిత్ షా అదే ప్రాంతంలో అధికారికంగా త్రివర్ణ పతాకం ఎగుర వేయటానికి సిద్దమయ్యారు


మరింత సమాచారం తెలుసుకోండి: