ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు నుండే గ్రామ/వార్డ్ వాలంటీర్ల వ్యవస్థ ప్రారంభం కాబోతుంది. గ్రామ, వార్డ్ వాలంటీర్ల ద్వారా ప్రభుత్వ సేవలు ఇంటి వద్దే లభ్యం కాబోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 1,93,421 మంది గ్రామ వాలంటీర్లుగా, 74,659 మంది వార్డ్ వాలంటీర్లుగా ఈ రోజు నుండి విధులు నిర్వర్తించబోతున్నారు. గ్రామ/వార్డ్ వాలంటీర్లు ప్రభుత్వ పథకాల గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తారు. 
 
ప్రజల యొక్క సమస్యలను గ్రామ సచివాలయాల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళతారు. ఆదాయ, కుల, ఇతర ధృవీకరణ పత్రాలను గ్రామ/వార్డ్ వాలంటీర్లు ఇంటివద్దకే అందజేస్తారు. రేషన్, ఫించన్, నవ రత్నాల ద్వారా కలిగే ప్రయోజనాలను గ్రామ/వార్డ్ వాలంటీర్లు ఇంటివద్దకే అందజేస్తారు. గ్రామ/వార్డ్ వాలంటీర్లు గ్రామ సచివాలయాలకు ధరఖాస్తులు తీసుకొనివెళ్ళి, ధరఖాస్తుకు సంబంధించిన సమస్య పూర్తి అయ్యేదాకా అన్ని విషయాల్లోను సహాయ సహకారాలు అందిస్తారు. 
 
ప్రభుత్వం గ్రామ వాలంటీర్లకు 5000 రుపాయల గౌరవ వేతనం ప్రతి నెల అందిస్తుంది. ఈరోజు విధుల్లోకి చేరిన తరువాత గ్రామ/వార్డ్ వాలంటీర్లు వారికి కేటాయించిన కుటుంబాలను పరిచయం చేసుకుంటారు. ఈ నెల 26 వ తేదీ నుండి ఇంటి స్థలాలు, ఇతర పథకాలకు సంబంధించిన లబ్ధిదారుల సర్వే చేస్తారు గ్రామ/వార్డ్ వాలంటీర్లు. సెప్టెంబర్ 1్ తేదీ నుండి 10 వ తేదీ వరకు బియ్యం, ఫించన్ గ్రామ/వార్డ్ వాలంటీర్లు డోర్ డెలివరీ చేస్తారు. 
 
సెప్టెంబర్ 15 వ తేదీ నుండి 30్ తేదీ వరకు గ్రామ/వార్డ్ వాలంటీర్లకు శిక్షణ ఉంటుంది.గ్రామ/వార్డ్ వాలంటీర్లు ఎవరైనా అవినీతి చేసినా, సేవలు అందించటంలో పక్షపాతం చూపించినా 1902 నెంబర్ కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదు చేసిన తరువాత ప్రభుత్వం ఫిర్యాదుపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటుంది. గ్రామ/వార్డ్ వాలంటీర్లుగా ఎంపికైన వారు ఈ ఉద్యోగాలు రావటం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 
 
 
 



మరింత సమాచారం తెలుసుకోండి: