స్వాతంత్ర దినోత్సవం రోజున ప్రధాని ఎర్రకోటపై జెండా ఎగురవేస్తారు.  అనంతరం జాతిని ఉద్దేశించి మాట్లాడతారు.  జరిగిన అభివృద్ధి, భవిష్యత్తులో జరగబోయే అభివృద్ధి గురించి అయన మాట్లాడతారు.  గత 71 సంవత్సరాలుగా జరుగుతున్న తతంగం ఇదే.  అయితే, ఈసారి వెరీ స్పెషల్ అని చెప్పాలి.  జమ్మూ కశ్మీర్ ఇండియాలో పూర్తిగా అంతర్భాగం అయ్యాక జరుగుతున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఇవి.  జమ్మూ కాశ్మీర్ పైనే అందరి దృష్టి ఉన్నది.  


జమ్మూలో పరిస్థితులు పూర్తిగా అదుపులో ఉన్నాయి.  అక్కడ జెండా పండుగను అంగరంగ వైభవంగా జరిపేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే, కాశ్మీర్ లో మాత్రం పరిస్థితులు ఇంకా అదుపులోకి రాలేదు.  కొంచం సమయం పట్టేలా కనిపిస్తోంది.   జమ్మూ కాశ్మీర్ గవర్నర్ సత్యపాల్ సింగ్ షేర్ ఇ కాశ్మీర్ స్టేడియంలో జరిగే వేడుకల్లో పాల్గొంటారు.  అక్కడ అయన జాతీయ ఆవిష్కరిస్తారు.  అనంతరం అయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు.  


అయితే, ఈ వేడుకలను అడ్డుకోవడానికి కొన్ని శక్తులు ప్లాన్ చేశాయి.  రోడ్డుపై రగడ చేసేందుకు ప్రయాణించగా వారిని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.  అక్కడక్కడా చిన్న చిన్న సంఘటనలు మినహా కాశ్మీర్ అంతా ప్రస్తుతానికి ప్రశాంతంగా ఉన్నది.  ఎలాంటి ఇబ్బందులు లేవని జమ్మూ కాశ్మీర్ పోలీసులు చెప్తున్నారు. 



ఇక రాష్ట్రంలోని అన్ని పంచాయితీల్లో జెండా పండుగను నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.  ప్రతి పంచాయితీలో పంచాయితీ భవనంపై జాతీయ జెండా ఎగురవేయాలని ఆదేశాలు జారీ చేశారు.  ఆ రాష్ట్రంలో త్వరలోనే పంచాయితీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధం అయ్యింది.  మరో కొన్ని రోజుల్లో అన్ని సర్దుకుంటాయని జమ్మూ కాశ్మీర్ గవర్నర్ సత్యపాల్ సింగ్ పేర్కొన్నాడు.  సత్యపాల్ సింగ్ కు దాదాపు 200 మందితో అదనపు భద్రతను ఏర్పాటు చేసింది ప్రభుత్వం.  


మరింత సమాచారం తెలుసుకోండి: