జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఈ మధ్య కాలంలో ఎక్కడలేని కామెడీని పండిస్తున్నాయి. సోషల్ మీడియాలో పవన్ వ్యాఖ్యలు విపరీతంగా ట్రోలింగ్ కు గురౌతున్నాయి. అప్పట్లో జగన్ మీద అర్ధం పర్ధం లేని విమర్శలు చేసి విమర్శలు మూటగట్టుకున్న సంగతీ తెలిసిందే. జగన్ మీద కేసులు ఉండటం వల్లే అతను రోడ్ మీదకు వచ్చి ప్రజల్లో కష్టపడ్డాడని లేకపోతే ఇంట్లోనే కూర్చునేవాడని చెప్పుకొచ్చారు అప్పట్లో . ఇందులో ఎంత మాత్రం లాజిక్ ఉందన్న సంగతీ వేరే చెప్పాల్సిన పని లేదు. జగన్ ప్రజల్లో తిరిగి కష్టపడి సీఎం అయ్యాడని, నేను కూడా ప్రజల్లో ఉండి సీఎం అవుతానని చెబూతూనే కానీ నేను వస్తే అభిమానులు తనను ముక్కలు ముక్కలుగా పీక్కుతుంటారని చెప్పి అందరిని అప్పట్లో ఆశ్చర్యానికి గురి చేశారు.


నిజానికి ఎంతో క్రేజ్ ఉన్న సినీ స్టార్స్, రాజకీయ నాయకులూ ప్రజలతో కలిసి వాటితో మమేకం అయిన వారే. నాటి ఎన్టీఆర్ నుంచి వైస్సార్ వరకు అందరూ ప్రజల్లో తిరిగినవారే. కానీ పవన్ వ్యాఖ్యలను వీరందరి కంటే గొప్ప వ్యక్తిగా ఫీల్ అవుతున్నట్టున్నారు. అందుకే ఈ వ్యాఖ్యల పట్ల కొన్ని రోజుల క్రితం పవన్ మీద భయంకరంగా సెటైర్లు పడ్డాయి. అయితే పవన్ కళ్యాణ్ తన కామెడీ డైలాగ్స్ ను ఇంకా వదిలి పెట్టడం లేదు. 


జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ .. పేకాట రాయుళ్లను విడిపించే క్రమంలో పోలీస్ స్టేషన్ మీద దాడి చేసి అడ్డంగా బుక్ అయిన సంగతీ తెలిసిందే. అసలు ఎమ్మెల్యే అయ్యి ఉండి ఇటువంటి లత్కోరు పంచాయతీలో ఉండటం తప్పు. అయితే రాపాక జనసేన ఎమ్మెల్యే కాబట్టి సపోర్ట్ గా మాట్లాడటం తప్పు కాదు. అయితే పవన్ ఏమన్నాడంటే జనసేన ఎమ్మెల్యేను లాక్కోవటానికి వైసీపీ ప్రయత్నిస్తుందంటా .. ఇంత కంటే కామెడీ ఇంకెక్కడైనా ఉంటుందా .. ఇప్పటికే వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. టీడీపీ నుంచి కూడా చాలా మంది వస్తామన్నా .. రాజీనామా చేసి రావాలని జగన్ పెట్టిన షరతు. అలాంటిది .. జనసేన ఎమ్మెల్యే కోసం వైసీపీ ప్రయత్నం చేస్తుందంటూ పవన్ తెగ కామెడీని చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: