భారత దేశం సగర్వంగా ప్రయోగించిన చంద్రయాన్ 2 ప్రయోగం కీలక దశకు చేరుతోంది. గత నెల 22న శ్రీహరికోట నుంచి అంతరిక్షంలోకి దూసుకెళ్లింది. అంతకు కొన్ని రోజుల ముందే ఈ ఉపగ్రహ ప్రయోగం జరగాల్సి ఉన్నా.. చివరి నిమిషంలో ఓ పొరపాటును గ్రహించి ప్రయోగాన్ని అనూహ్యంగా వాయిదా వేశారు. చివరకు జూలై 22న చంద్రయాన్ ను విజయవంతంగా అంతరిక్షంలోకి పంపారు.


అయితే అంతరిక్షంలోకి విజయవంతంగా వెళ్లినా ఇంకా ప్రయోగంలో కీలక దశలు ఉన్నాయి. ఇప్పటి వరకూ భూ కక్ష్యలో ప్రయాణించిన చంద్రయాన్ 2 ఉపగ్రహం.. ఇప్పుడే చంద్రుని కక్షలోకి మారుతోంది. ఇది చాలా కీలక ఘట్టం.. అయితే ఈ ఉపగ్రహ నియంత్రణ అంతా బెంగళూరులోని ఇస్రో ప్రధాన కార్యాలయం నుంచే జరుగుతోంది. బుధవారం తుది కక్ష్యలోకి పెంచేందుకు వాహన నౌకలోని ద్రవ ఇంజిన్‌ను కొంతసేపు మండించారు. జులై 23 నుంచి ఈ నెల 6వ తేదీ వరకు కక్ష్య పెంచేందుకు మొత్తం ఐదుసార్లు ఇలా మండించారు.


ఇక ఇప్పుడు ఏం జరుగుతుందంటే... చంద్రయాన్ వాహన నౌక భూకక్ష్య నుంచి చంద్రుడి కక్ష్యలోకి అడుగుపెడుతుంది. చంద్రుని కక్ష్యలో చంద్రయాన్ ఉపగ్రహం ఏడు రోజులపాటు ప్రయాణిస్తుంది. ఆ తర్వాత చంద్రుని చేరుకుంటుంది. ఈ ఏడు రోజులు కూడా ఉపగ్రహ గమనాన్ని ఇస్రో నుంచి శాస్త్రవేత్తలు నియంత్రిస్తుంటారు. ప్రస్తుత అంచనా ప్రకారం.. సెప్టెంబరు 7న వాహన నౌక ల్యాండర్‌, రోవర్‌ను తీసుకెళ్లి చంద్రుని దక్షిణ ధ్రువం పై దింపే అవకాశం ఉంది


మరో ఐదు రోజుల్లో ఉపగ్రహం చంద్రుని వద్దకు చేరుకుంటుంది. ఆ తర్వాత మరో 17 రోజుల పాటు వివిధ ప్రక్రియ తర్వాతే చంద్రయాన్ చంద్రునిపై అడుగుపెడుతుంది. ఇస్రో అతి తక్కువ ఖర్చుతో చేసిన ఈ ప్రయోగం విజయవంతమైతే.. భారత్ కు అంతరిక్ష రంగంలో అగ్రరాజ్యాల సరసన నిలుస్తుంది. విశ్వవీధిలో భారత పతాక రెప రెప లాడుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: