ఏపీలో మొత్తానికి మొత్తం అసెంబ్లీ సీట్లు, ఎంపీ సీట్లు వూడ్చేసిన జగన్ రికార్డు స్రుష్టించారు. ఇక నలభయ్యేళ్ళ టీడీపీకి అవమానకరమైన అపజయం ఎదురైంది. పవన్ పార్టీ ఉనికిలో లేకుండా పోయింది. ఈ మొత్తం ఎపిసోడ్లో పవన్ తాను పోటీ చేసిన రెండు సీట్లలోనూ ఓటమి పాలు అయ్యారు. జగన్ ముఖ్యమంత్రిగా తన పని తాను చేసుకుపోతున్నారు.


కానీ జగన్ విజయం మీద మొదట్లో టీడీపీ అనుమానాలు వ్యక్తం చేసినా తరువాత తన తప్పులను వెతికే పనిలో పడింది. తాజాగా జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు కానీ, పొలిట్ బ్యూరో మీట్ కానీ టీడీపీ తాము ఎందుకు జనాలకు దూరమయ్యామని ఆలోచన చేస్తోంది. ఇపుడు పసుపు తమ్ముళ్ళు ఈవీఎంల వూసు అసలు  ఎత్తడం మానేశారు. 


కానీ పవన్ మాత్రం ఆశ్చర్యకరంగా ఈవీఎం ల ప్రస్తావన మళ్ళీ తెస్తున్నారు. ఏలూరు పార్టీ మీటింగులో ఆయన మాట్లాడుతూ,  ఈవీఎం ల సాయంతో గెలిచారని జగన్ని విమర్శిస్తున్నారు. మీరు ఏదో రకంగా అధికారంలోకి వచ్చారంటూ గొప్పగా ఇచ్చిన ప్రజా తీర్పుని ఆయన అవమానపరుస్తున్నారు. తన పార్టీ ఓటమికి కారణాలు ఇంకా తెలుసుకోలేకనే పవన్ ఇలా అంటున్నారా అని వైసీపీ నేతలు కౌంటర్లేస్తున్నారు.


మీరు ఈవీఎంల వల్లనే అధికారంలోకి వచ్చారంటూ జగన్ని ఉద్దేశించి పవన్ అనడం ద్వారా  జనంలో తమ పార్టీకి బలం ఉందని, ఫెయిర్ గా ఎన్నికలు జరిపిస్తే గెలుస్తామని చెప్పడమేగా. అది సరే కానీ జరిగింది జరిగింది. జగన్ ఈవీఎంల సాయంతోనే సీఎం అయితే అయ్యారు. ఇపుడు బంగారు లాంటి అవకాశం లోకల్ బాడీ ఎన్నికలు వస్తున్నాయి.  జనసేనకు జనంలో ఆదరణ ఉంటే గెలిపించుకోవచ్చునని రాజకీయ పండితులతో పాటు, వైసీపీ నేతలు కూడా సవాల్ చేస్తున్నారు. పవన్ ఇలా జగన్ మీద ఆడిపోసుకోవడం మాని తన పార్టీని చక్కదిద్దుకుంటే అది బెటర్ కదా అని అంతటా సూచనలు వస్తున్నాయి. మరి మన గబ్బర్ సింగ్ వింటారా.


మరింత సమాచారం తెలుసుకోండి: