ఇపుడిదే అంశంపై రాష్ట్ర రాజకీయాల్లో తీవ్రమైన చర్చ మొదలైంది. పునర్విభజన చట్టం ప్రకారం తెలుగురాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల సంఖ్య పెరగాలి. అయితే చంద్రబాబునాయుడుడ సిఎంగా ఉన్నంత కాలం ఈ విషయాన్ని కేంద్రం పట్టించుకోలేదు. సీట్ల సంఖ్య పెంపుపై చంద్రబాబు ఎంత ఒత్తిడి తెచ్చినా నరేంద్రమోడి ససేమిరా అన్నారు.

 

మరి మారిన పరిస్ధితుల్లో జమ్మూ-కాశ్మీర్ లో సీట్ల సంఖ్య పెంచాలన్న కారణంతో సిక్కింతో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా సీట్ల పెంపు అంశాన్ని కేంద్ర హోం శాఖ పరిశీలిస్తోంది. ఒకవేళ తెలుగు రాష్ట్రాల్లో  ప్రధానంగా ఏపిలో  సీట్ల సంఖ్య పెరిగితే తక్షణం లాభపడేది జగన్మోహన్ రెడ్డి ఒక్కరే అనటంలో సందేహం లేదు. మొన్నటి అఖండ విజయంతో జగన్ మంచి ఊపు మీదున్నారు.  మ్యానిఫెస్టోతో పాటు పాదయాత్రలో ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నారు కాబట్టి జనాధరణ బాగానే ఉంది. కాబట్టి సీట్ల సంఖ్య పెరిగినా గట్టి అభ్యర్ధులకు కొరవ వుండదు.

 

ఇక టిడపి విషయానికి వస్తే సీట్ల సంఖ్య చంద్రబాబుకు బాగా ఇబ్బందే. మొన్నటి ఘోర ఓటమితో చాలామంది నేతలు టిడిపికి రాజీనామా చేసేస్తున్నారు. వైసిపిలో అవకాశం లేకపోవటంతో బిజెపిలో చేరుతున్నారు. కాబట్టి భవిష్యత్తులో మరింతమంది నేతలు టిడిపి నుండి బిజెపిలోకి చేరిపోయే అవకాశాలే ఎక్కువున్నాయి. అంటే సీట్ల సంఖ్య పెరిగితే అన్ని చోట్ల గట్టి అభ్యర్ధులు చంద్రబాబుకు దొరకటం కష్టమనే అనుకోవాలి.

 

అలాగే బిజెపి, జనసేనల పరిస్ధితి కూడా సేమ్ టు సేమ్ అనే అనుకోవాలి. మొన్నటి ఎన్నికల్లోనే రెండు పార్టీలు 175 మంది గట్టి అభ్యర్ధులను నిలబెట్టలేక చేతులెత్తేశాయి. అలాంటిది అదనంగా మరో 50 నియోజకవర్గాల్లో అభ్యర్ధులను నిలబెట్టాలంటే మామూలు విషయం కాదు. ఏదో అన్నీ చోట్లా పోటిలోకి దిగటం వేరు, కనీసం గట్టి పోటి ఇస్తారు అని జనాలు అనుకునే స్ధాయిలో అభ్యర్ధులను పోటికి దింపటం వేరు. ఇక్కడే టిడిపి, బిజెపి, జనసేనల సత్తా ఏంటో తేలిపోతుంది. ఇక కాంగ్రెస్, వామపక్షాల సంగతంటారా మాట్లాడుకోవటం కూడా అనవసరమే.

 


మరింత సమాచారం తెలుసుకోండి: