తెలుగుదేశం పార్టీ ని కాదని , రాష్ట్రం లో వైకాపా ను ఎందుకు గెలిపించారో అర్ధం కావడం లేదన్న తెలుగుదేశం  పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు,  పాలిచ్చే ఆవు కాకుండా.. దున్నపోతని తెచ్చారని  వ్యాఖ్యానించడం తెల్సిందే .  చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు ఆయన విజ్ఞతకే వదిలివేస్తున్నామన్న వైకాపా నేతలు, బాబు బాష పై తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు  .  చంద్రబాబు భాష ఏమాత్రం  సంస్కారవంతంగా లేదని ఆ పార్టీ శాసనమండలి చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విమర్శించారు .


చంద్రబాబు ఐదేళ్లలో ప్రజలకు ఇచ్చింది పాలు కాదు.. ప్రజల నోట్లో మట్టి కొట్టారని మండిపడ్డారు. ప్రజల వివక్షతని తక్కువ అంచనా వెయ్యొద్దని,  ఆవు ఎవరో.. దున్న ఎవరో ప్రజలకు తెలుసునని మండిపడ్డారు . ప్రజల్ని చంద్రబాబు  మోసం చేశారు కనుకే గట్టిగా బుద్ది చెప్పారన్నారు. చంద్రబాబు మొహంలో ఎప్పుడూ నవ్వు ఉండదు.. అందుకే ఆయన్ని చీకటి చంద్రుడు అని అంటారని భాష్యం చెప్పారు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు . ఇచ్చిన హామీలు అమలు చెయ్యడంలో సీఎం  జగన్ మొండిగానే ఉంటారని ... జగన్ మొండేనని అన్నారు . ప్రజలకు మంచి చెయ్యాలనే దృఢమైన సంకల్పం ఉన్న వ్యక్తి  వై ఎస్ జగన్ అన్నారు .


 చంద్రబాబు నాయుడు లాంటి సీనియర్ రాజకీయ నాయకుడు సహనం కోల్పోయి, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని పట్టుకుని దున్న అని పోల్చడం ఏమిటన్న విమర్శలు   విన్పిస్తున్నాయి .  ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం నుంచి చంద్రబాబు ఇంకా కోలుకున్నట్లు కన్పించడం లేదని పలువురు అపహాస్యం చేస్తున్నారు .ఇటీవల జరిగిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశం లో చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రం లో ప్రజలు పాలిచ్చే అవును కాదని దున్నను తెచ్చుకున్నారనడం వివాదాస్పదమైంది .  


మరింత సమాచారం తెలుసుకోండి: