ఈ మధ్య కాలంలో ప్రజల యొక్క సమస్యలను తెలుసుకునేందుకు ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్పొరేటర్లు, ఇతర ప్రజా ప్రతినిధులు ఫేస్ బుక్, ట్విట్టర్ ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఫేస్ బుక్, ట్విట్టర్ ద్వారా ప్రజల యొక్క సమస్యలను తెలుసుకొని పరిష్కరించడానికి వీరు కృషి చేస్తున్నారు. నాయకులు ప్రజలకు మేలు చేయటం కోసం ఉపయోగిస్తున్న ఫేస్ బుక్, ట్విట్టర్ ఖాతాలను సైబర్ నేరస్థులు హ్యాక్ చేసి వారి ఖాతాల్లో వివాదాస్పద పోస్టులు పెడుతున్నారు. 
 
గత 15 రోజుల్లో సైబర్ నేరస్థులు ఇద్దరు కార్పొరేటర్ల ఖాతాలు హ్యాక్ చేసి కార్పొరేటర్ల పరువు, ప్రతిష్టలకు భంగం కలిగేలా వ్యవహరిస్తున్నారు. ఫేస్ బుక్ ఖాతాలు హ్యాక్ చేయటంతో ఏం చేయాలో అర్థం కాని ఇద్దరు కార్పొరేటర్లు పోలీసులకు ఫిర్యాదు చేసారు. మంగళ్ హాట్ కార్పొరేటర్ పరమేశ్వరి యొక్క ఫేస్ బుక్ ఖాతాను సైబర్ నేరస్థులు హ్యాక్ చేసి ఖాతాలోని పేరును మార్చారు. కార్పొరేటర్ పరమేశ్వరి యొక్క ఫేస్ బుక్ పాస్ వర్డ్ తెలుసుకున్న సైబర్ నేరస్థులు  ఫేస్ బుక్ ఖాతాను ఉపయోగించి అశ్లీల వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. 
 
పరమేశ్వరి యొక్క స్నేహితులు, బంధువులు పోస్టుల గురించి ప్రశ్నించటంతో పరమేశ్వరి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసి తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. మెహిదీపట్నంకు చెందిన కార్పొరేటర్ మాజిద్ హుస్సేన్ యొక్క రెండు ఫేస్ బుక్ ఖాతాలను సైబర్ నేరస్థులు హ్యాక్ చేసారు. మాజిద్ హుసేన్ ఫేస్ బుక్ ఖాతాల నుండి మాజిద్ హుసేన్ స్నేహితురాలినని చెబుతూ అసభ్య సందేశాలు వస్తూ ఉండటం గురించి మాజిద్ స్నేహితులు అతని దృష్టికి తెచ్చారు. 
 
మాజిద్ హుస్సేన్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసి తన యొక్క రాజకీయ ప్రతిష్టను దిగజార్చటం కోసమే ఎవరో ఇలా కావాలని చేసారని అభిప్రాయం వ్యక్తం చేసాడు. సైబర్ క్రైమ్ పోలీసులు ప్రజా ప్రతినిధులను లక్ష్యంగా చేసుకొని ఖాతాలను హ్యాక్ చేస్తున్న సైబర్ నేరస్థులను పట్టుకోవటానికి ప్రత్యేకమైన బృందాలను ఏర్పాటు చేసారు. నిందితులను గుర్తించే పనిలో ఉన్నామని సైబర్ క్రైమ్స్ అదనపు డీసీపీ కే.సీ.ఎన్ రఘువీర్ తెలిపారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: