ప్రధాని మోడీ వరసగా డేరింగ్ నిర్ణయాలు తీసుకుంటూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు.  రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత మొదట త్రిపుల్ తలాక్, ఎన్ఎంసి బిల్లు, ఆ తరువాత ఆర్టికల్ 370 రద్దు ను చేసి షాక్ ఇచ్చాడు.  జమ్మూ కాశ్మీర్ పునర్విభజన బిల్లుతో మరో షాక్ ఇచ్చారు.  ఇలా వరసగా షాక్ లు ఇస్తున్న మోడీ.. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగరవేసిన తరువాత చేసిన ప్రసంగం ఆధ్యంతం ఆకట్టుకుంది.  అధికారంలో ఉండి ఏ జాతీయ నాయకుడు టచ్ చేయాలని విషయాన్ని మోడీ టచ్ చేసి షాక్ ఇచ్చాడు.  


ఒకప్పుడు ఈ అంశం గురించి ఇందిరా గాంధీ తనయుడు సంజయ్ గాంధీ ఈ అంశాన్ని తెరమీదకు తీసుకొచ్చాడు.  తీసుకురావడమే కాదు దీనిని చర్చకుకూడా పెట్టారు.  కానీ, ఆ విషయాన్ని ఎవరు పట్టించుకోలేదు.  సీరియస్ గా తీసుకోలేదు.  అప్పట్లో సీరియస్ గా తీసుకుంటే.. ఇప్పుడు ఇండియా జనాభా ఈ స్థాయిలో ఉండేది కాదు.  ఇండియా ప్రజలు ఏ విషయాన్నైనా ఆమోదిస్తారేమోగాని, పిల్లల విషయంలో మాత్రం ససేమిరా అంటారు.  మాకు తెలుసులే.. మీరు చెప్పాల్సిన అవసరం లేదని పక్కన పెట్టేస్తుంటారు.  


జనాభా నియంత్రకు సంబంధించిన అంశాన్ని మోడీ తిరిగి తెరపైకి తీసుకొచ్చారు. "బిడ్డ పుట్టక ముందే వారి గురించి బాగా ఆలోచించండి. విద్యావంతులైన తల్లిదండ్రులు అలాగే ఆలోచిస్తారు. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకునే ప్రజలు ఈ దేశంలో ఉన్నారని అంగీకరించండి. ఇలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు కుటుంబాన్ని పరిమితం చేసుకుంటారు. నాకు పుట్టబోయే వారికి నేను న్యాయం చేయగలనా అనే ఆలోచన వస్తుంది. పరిమిత కుటుంబం ఉండడం వల్ల వాళ్లకు అన్ని రకాల సౌకర్యాల్ని అందించగలరు. ఇది మంచి పద్దతే కాదు, ఇదీ ఒక రకంగా దేశభక్తే" అని అన్నారు. 


ఈ విషయం గురించి దేశంలోని ప్రతి ఒక్కరు ఆలోచించాలని, దేశం అభివృద్ధి అన్నది ఏ ఒక్కరితోనో సాధ్యం కాదని.. అందరు కలిస్తేనే సాధ్యం అవుతుందని, ప్రతి తల్లిదండ్రి దీని గురించి తప్పకుండా ఆలోచన చేయాలనీ మోడీ కోరారు.  మోడీ చెప్పిన అంశం గురించి ఎంతమంది ఆలోచిస్తారో చూడాలి.  ఇప్పటికే ఇండియా జనాభా 120 కోట్లు దాటింది.  జనాభా నియంత్రణకు పాటించకపోతే.. ఈ జనాభా మరింతగా పెరిగి చైనాను దాటేస్తుంది.  పెరిగిన, పెరుగుతున్న జనాభాకు మౌళిక వసతులు కల్పించడం చాలా కష్టం.  ఈ విషయాన్ని ప్రజలు సీరియస్ గా తీసుకుంటారా చూద్దాం.  

మరింత సమాచారం తెలుసుకోండి: