బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అఖండ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. కేంద్రం స్థాయిలో మోడీ హవాతో దేశం మొత్తం స్వీప్ చేసింది. దీనితో కేంద్రంలో బీజేపీకి తిరుగు లేకుండా పోయింది. అయితే అన్ని రాష్ట్రాల్లో చివరికి సౌత్ లోని కర్ణాటకలో కూడా బీజేపీ హవా స్పష్టంగా కనిపించినా ఏపీ లో మాత్రం లేదు. జగన్ .. 30 ఏళ్ల టీడీపీని మట్టికరిపించి 25 పార్లమెంట్ స్థానాల్లో ఏకంగా 22 స్థానాలు గెలుచుకొని సరికొత్త సునామీని సృష్టించారు. అయితే తెలంగాణలో మాత్రం బీజేపీ అనూహ్యంగా 4 ఎంపీ స్థానాలను గెలుచుకొని ఔరా అనిపించింది. దీనితో తెలంగాణలో బీజేపీ పాగా వేయాలని దృడంగా నిశ్చయించుకుంది. అమిత్ షా కూడా తెలంగాణ మీద గట్టిగా ఫోకస్ చేశారు. 


తెలంగాణలో తెరాస కు తామే ప్రధాన ప్రతి పక్షమని బీజేపీ నేతలు చెబుతున్నారు. దీనితో తెరాస లో ఎక్కడ లేని ఒణుకు మొదలైంది. ఎందుకంటే తెరాస పార్టీకి కాంగ్రెస్ ను ఎదుర్కోవటం సులభం గాని బీజేపీ లాంటి పార్టీని ఎదుర్కోవటం అంత సులభం కాదు. పైకి తెరాస నేతలు గంభీరంగా మాట్లాడుతున్న వారి మాటల్లోనే అర్ధం అవుతుంది. బీజేపీ ఎంతలా తమను డామేజ్ చేయగలడో ! 


బీజేపీ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంటూ దేశంలో ఉన్న ప్రధాన ప్రతి పక్షమైన కాంగ్రెస్ ను దెబ్బ తీస్తుంది. ఇప్పటికే ఈ పార్టీ అస్తిత్వం కోసం పోరాడిల్సిన పరిస్థితి వచ్చింది. మరో పక్క బీజేపీ ఇప్పటికే పార్లమెంట్ లో సంచలన విజయాన్ని నమోదు చేసి కాంగ్రెస్ ను మట్టి కరిపించింది. ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా రాజీనామా చేయడంతో ఇప్పుడు ఆ పార్టీ గందర గోళంలో పడింది. దీనితో కాంగ్రెస్ పరిస్థితి ప్రతి స్టేట్ లో నానాటికి దిగజారి పోతుంది. తెలంగాణలో అయితే ఆ పార్టీ శాసనసభ పక్షం ఏకంగా తెరాస లో కలిసిన పరిస్థితి. దీనితో బీజేపీ ఒక్కటే తెరాస ను ఎదుర్కోగలదని బీజేపీ నేతలు చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: