ఈ ఏడాది స్వాతంత్ర దినోత్సవానికి ఎంతో విశిష్టత ఉంది. ఎందుకంటే కాశ్మీర్లో కూడా మువ్వన్నెల రెపరెపలు భారతీయులందరిలోనూ ఆనందాన్ని, గర్వాన్ని నింపుతున్నాయి. దాంతో ప్రతీ ఒక్కరు గుండె మీద చేయి వేసుకుని మరీ ఈసారి స్వాతంత్ర వేడుకలను జరుపుకుంటున్నారు. ఇదిలా ఉండగా కాశ్మీర్లో జాతీయ జెండా ఎగిరిందన్న ఆనందం నిలిచేలా లేకుండా కొన్ని పరిణామాలు  చేస్తున్నాయి. 


ఈశాన్య రాష్టమైన నాగాలాండ్ లో నాగా జాతీయ జెండాను ఎగురవేసి నాగాలు ఈ రోజు  స్వాతంత్ర వేడుకలను జరుపుకోవడం బాధాకరం. మొత్తం దేశం యావత్తు మూడు రంగుల జెండాకు వందనం చేస్తే నాగాలాండ్ లో మాత్రం తాము సొంతంగా రూపొందించుకున్న జెండాతో వేడుకల్లో పాలుపంచుకోవడం భారత మాత గుండెల్లో గునపాలు గుచ్చడమే.


ఈ పరిణామం ఇపుడు దేశమంతటా చర్చగా మారింది. ఈశాన్య రాష్ట్రాల్లో వేర్పాటువాదం తగ్గిందని, బీజేపీ పాలనలో దేశమంతా ఒకే జెండా, ఒక్కటే అజెండాగా ముందుకు సాగుతోందని అంతా భావిస్తున్నారు. మరి ఈ సమయంలో పక్కలో బల్లెం మాదిరిగా సంభవించిన ఈ పరిణామం మాత్రం భారతీయులు కలత చెందేలాగానే ఉందని అంటున్నారు.


నాగాలాండ్ లో ఈ రకమైన తీరున సొంత జెండాతో వేడుకలు నిర్వహించడం పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. కాశ్మీర్ ని సైతం కలుపుకుని గొప్పగా వేడుకలు నిర్వహిస్తూంటే ఈశాన్య రాష్ట్రాలకు ఏమైందన్న ఆవేదన కనిపిస్తోంది. ఈ విషయంలో కేంద్రం వెంటనే ద్రుష్టి సారించి తగిన చర్యలు తీసుకుంటేనే తప్ప ఈ బాధ భారతీయులకు తీరేలా కనిపించడంలేదు.  వేర్పాటు వాదం ఎక్కడ ఉన్నా ప్రత్యేకత ఎలా చాటుకోవాలని చూసినా దేశభక్తి ముందు అవన్నీ కూడా బలాదూర్ అని చాటి చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. దానికి మోడీ సర్కార్ సరైన మందు వేస్తుందనే నమ్మకాన్ని ప్రతీ ఒక్కరూ  అంతా వ్యక్తం చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: