జగన్ ప్రతి పక్షంలో ఉన్నప్పుడు ఎప్పుడు తరచు ఒక మాట చెప్పేవారు. ఒక్క సారి నాకు అధికారం ఇచ్చి చూడండి. పాలనా ఎలా ఉంటుందో చూపిస్తానని చెప్పారు. ప్రమాణ స్వీకారం రోజు కూడా ఇదే మాదిరి వ్యాఖ్యలు చేశారు. పాలనా అంటే ఎలా ఉంటుందో చూపిస్తానని చెప్పారు. అనుకున్న విధంగానే మొదటి 70 రోజుల్లో తన పాలనా ఎలా ఉండబోతుందో చూపించారు. ఏపీ కాదు కదా భారత దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇవ్వని భారీ నోటిఫికేషన్ ఇచ్చి అందరి చేత శెభాష్ అనిపించుకున్నారు. గ్రామా వాలంటీర్ల రూపంలో .. గ్రామ సెక్రటరీ రూపంలో లక్షల్లో ఉద్యోగులు భర్తీ చేసి అన్న మాట నిలబెట్టుకున్నారు. గత ప్రభుత్వానికి తన ప్రభుత్వానికి తేడా ఏంటో చూపించారు. 


గత ప్రభుత్వం యువతకు నెలకు 2000 రూపాయలు ఇచ్చి వృద్ధాప్య .. వికలాంగుల క్యాటగిరీలోకి నెట్టింది. ఆ పధకాన్ని చంద్రబాబు తన కొడుకు లోకేష్ ఇదొక చారిత్రతాత్మక పధకమని ప్రమోట్ చేసుకోవటం. కానీ నెలకు రెండు వేలు రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకున్న టీడీపీ అది ఎంత పనికిమాలిన పథకమో .. యువత తన ఓట్ల రూపంలో చూపించింది. ఈ సారి గంప గుత్తగా అందరూ యువకులు జగన్ కు ఓట్లు వేశారు. 


అయితే జగన్ ఈ రోజు స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని యువతకు మరో తియ్యని వార్త చెప్పారు. ఇంకా రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ త్వరలో ఇస్తామని పేర్కొన్నారు. దీనితో యువత ఆనందంలో మునిగి పోయింది. గత ప్రభుత్వ హయాంలో నామమాత్రంగా ఉన్న ప్రభుత్వ ఖాళీలను కూడా భర్తీ చేయలేదు. దీనితో ప్రభుత్వ ఖాళీలు చాలా పెరిగిపోయాయి. జగన్ ప్రకటన ఇప్పుడు మరో సంచలనమంటే అతిశయెక్తి కాదు. అయితే జగన్ భారీ నోటిఫికేషన్ లతో యువత బిజీ గా మారిపోయారని టీడీపీ నేతలు కూడా చర్చించుకుంటున్న పరిస్థితి. దీనితో టీడీపీలో ఆందోళన స్పష్టంగా కనిపిస్తుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: