పవన్ కళ్యాణ్ సినిమాలు వదులుకొని రాజకీయాల్లోకి వచ్చారు. కోట్ల ఆదాయాన్ని వదులుకొని మార్పు కోసం రాజకీయాల్లోకి వచ్చానని, పవన్ కళ్యాణ్ పదే, పదే చెబుతారు. ఎన్నికలో తమ పార్టీ ఓడిపోవడానికి కారణం తాము డబ్బు పంచలేదని అందుకే ఓడిపోయాము అని కానీ నీతివంత మైన రాజకీయాలు చేస్తానని, పవన్ చెప్పారు. అయితే  ఈ మధ్య పవన్ వ్యాఖ్యలు చూస్తుంటే కేవలం మాటలు మాత్రమేనని ఆచరణ ఉండదని పవన్ నిరూపిస్తున్నారు. రాజకీయాల్లో తాను ఏ ఆశయంతో వచ్చానని చెప్పుకునే పవన్ దాన్నే తుంగలో తొక్కుతున్నారు. అర్ధం .. పర్ధం లేని విమర్శలు చేసి తానూ కూడా ఒక సాధారణ రాజకీయనాయకుడేనని చెప్పకనే చెబుతున్నారు. 


అయితే జనసేన ఎమ్మెల్యే రాపాక తన అనుచరులైన పేకాట రాయుళ్లను కాపాడే క్రమంలో పోలీస్ స్టేషన్ మీద దాడి చేసిన సంగతీ తెలిసిందే. ఈ విషయంలో రాపాక పలు విమర్శలు ఎదుర్కొన్నారు. అయితే ఇదే విషయంలో పవన్ కూడా కలుగజేసుకొని ఉన్న పరువును పోగొట్టుకుంటున్నారు. తన ఎమ్మెల్యేను కాపాడే క్రమంలో అధికార పార్టీ పై చౌకబారు వ్యాఖ్యలు చేస్తూ నవ్వులుపాలు అవుతున్నారు. 


జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ .. పేకాట రాయుళ్లను విడిపించే క్రమంలో పోలీస్ స్టేషన్ మీద దాడి చేసి అడ్డంగా బుక్ అయిన సంగతీ తెలిసిందే. అసలు ఎమ్మెల్యే అయ్యి ఉండి ఇటువంటి లత్కోరు పంచాయతీలో ఉండటం తప్పు. అయితే రాపాక జనసేన ఎమ్మెల్యే కాబట్టి సపోర్ట్ గా మాట్లాడటం తప్పు కాదు. అయితే పవన్ ఏమన్నాడంటే జనసేన ఎమ్మెల్యేను లాక్కోవటానికి వైసీపీ ప్రయత్నిస్తుందంటా .. ఈ వ్యాఖ్యలతోనే పవన్ దిగజారిపోయారు. అధికార పార్టీకి ఇప్పుడు ఏ పార్టీ ఎమ్మెల్యే అవసరం లేని సంగతీ తెలిసిందే. పైగా జగన్ కూడా అసెంబ్లీ సాక్షిగా చెప్పుకొచ్చారు. ఏ ఎమ్మెల్యే అయిన ఫిరాయిస్తే వేటు వేయమని .. కానీ పవన్ కు ఇవన్నీ అనవసరం .. ఎదో ఒక విధంగా జగన్ మీద బురద చల్లడమే ఆయనకు కావాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: