జగన్ కి ఏం పాలనానుభవం ఉందని ఎద్దేవా చేశారు. కానీ జగన్ తీసుకొస్తున్న పధకాలు. ఆయన ఆలోచనలు చూస్తే మాత్రం తలపండిన వారు సైతం షాక్ తినాల్సిందే. జగన్ లో ఇంత మేధస్సు ఉందా అని అనుకోవాల్సిందే ఈ పని మనం ఎందుకు చేయలేకపోయామని తలచి వగచాల్సిందే.


ఇంతకీ జగన్ బ్రైన్ చైల్డ్ స్కీమ్స్  ఒకటి రెండూ కావు. చాలానే ఉన్నాయి. అవి వరసగా తాను అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ అమలు చేసుకుంటూ పోతున్నారు.  అందులో ఎన్నదగినది గ్రామ వాలంటీర్ల వ్యవస్థ. అతి పెద్దదైన ఈ వ్యవస్థను  జగన్ ఈ రోజు ప్రారంభించారు. మే 30న జగన్ ప్రమాణం చేస్తూ గ్రామ వాలంటీర్ల గురించి తొలిసారి  ప్రకటించారు. ఆగస్ట్ 15న ప్రారంభిస్తామంటూ కూడా డేట్ ఇచ్చేశారు. ఆనాడు ఎవరూ కూడా అనుకున్న టైం కి ఇది అమల్లోకి వస్తుందని అనుకోలేదు. ఎందుకంటే కచ్చితంగా అప్పటికి  రెండున్నర నెలలు మాత్రమే ఉంది.


ఇంతలోనే అన్నీ రకాలుగా దూకుడుగా పని చేసిన వైసీపీ సర్కార్ ఈ రోజులో గ్రామ వాలంటీర్ల వ్యవస్థను జనంలోకీ తీసుకొచ్చేసింది. అంటే దీని వెనక జగన్ క్రుషి ఎక్కువగా  ఉందని చెప్పాలి.  రెండు లక్షల ఎనభై వేల మంది గ్రామ వాలంటీర్లు అంటే తమాషా కాదు, వీరంతా ప్రభుత్వ పధకాలను జనాలకు చేరవేడమే కాదు, జనానికి ప్రభుత్వానికి వారధిగా ఉంటారు. ఈ రోజు స్వాతంత్ర దినోత్స వేళ జగన్ ఈ వ్యవష్తకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యవస్థ దేశంలోనే వినూత్నమైనదని అన్నారు.  దీన్ని ఏపీలో తాము ప్రవేశపెట్టడం గొప్ప విషయం అన్నారు


. ఇకపై తన గొంతుక వాలంటీర్ల నుంచి వినిపించాలని జగన్ సూచించారు. అక్టోబర్ 2 నుంచి గ్రామ సచివాలయాలు కూడా ప్రారంభిస్తామని జగన్ చెప్పారు. మొత్తానికి చూసినపుడు ఈ వ్యవస్థ బాగానే డిజైన్ చేశారు. నేరుగా ప్రభుత్వానికి లింక్ ఉన్న వాలంటీర్లు ప్రజల వద్దకు వస్తారు. లోపాలు తెల్సుకుని ప్రభుత్వానికి చెబుతారు. ప్రభుత్వం ప్రొగ్రాంస్ కూడా  ప్రజలకు వివరిస్తారు. మరి ఇది కనుక హిట్ అయితే జగన్ కి తిరుగు లేదని చెప్పాలి. బలమైన వ్యవస్థ తోడుగా జగన్ మరింత దూకుడుగా రాజకీయల్లో బలపడడం ఖాయమని అంటున్నారు. అపుడు మిగిలిన పార్టీలు తలుపులు మూసుకోవాల్సిందేనని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: