ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ట్విట్టర్ వేధికగా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి  వైఎస్ జగన్ ను ఉద్దేశిస్తూ వ్యంగ్యాస్త్రాలు కురిపించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అమరావతిపై గతంలో చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ సంచలన ట్విట్ చేశారు. గ్రాఫిక్స్ అమరావతి అన్న వారి చేతనే ఆ భ్రమరావతిని మరింతా అందంగా చూపించారు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. 


చంద్రబాబు నాయుడు ట్విట్ చేస్తూ 'దేవుడు స్క్రిప్ట్ భలే రాశాడు... ఎవరైతే అమరావతిని గ్రాఫిక్స్, భ్రమరావతి అని అబద్ధాలు చెప్పారో, వాళ్ళ చేతనే ఇప్పుడు అక్కడ లైటింగ్ పెట్టించి దాన్ని మరింత అందంగా చూపించేలా చేశాడు.' అంటూ ట్విట్ చేశాడు చంద్రన్న. ఈ ట్విట్ చుసిన నెటిజన్లు ఆగ్రహం వ్యక్త చేస్తున్నారు. ముఖ్యమంత్రి అన్న దానిలో తప్పు ఏముంది అది నిజమే కదా అని కొందరు అంటే.


మరి కొందరు ట్విట్ చేస్తూ 'బాబాయ్... ఇంతకీ అక్కడ ఏముంది??? తమరు గ్రాఫిక్స్ లో చూపిన బ్రిడ్జ్ లు, పార్క్ లు ఎక్కడ??? అది నిజంగా మీరు ఇప్పుడు ట్విట్ చేసినట్టు, మీరు ఊహించినట్టు అది భ్రమరావతినే' అంటూ ట్విట్ చేశారు నెటిజన్లు. మరి కొందరు ట్విట్ చేస్తూ 'స్వాతంత్ర్య దినోత్సవాన్ని రాజకీయంగా వాడకండి అంటూ ట్విట్ చేస్తున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: